ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణం పాక్, చైనాలే

ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణం పాక్, చైనాలే

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాలే కారణమంటు మండిపడ్డారు యూపీకి చెందిన బీజేపీ నేత వినీత్ అగర్వాల్. ఢిల్లీలోకి పాక్, చైనా దేశాలు విష వాయువులను వదిలి ఉంటాయంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి భయపడుతూ.. ఇరు దేశాలు ఈ దారుణానికి ఒడిగడుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. మనతో ప్రత్యక్షంగా తలపడలేక.. ఇలాంటి కుట్రలకు పాల్పుడుతున్నాయన్నారు. రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవ్వడం.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 07, 2019 | 3:19 AM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాలే కారణమంటు మండిపడ్డారు యూపీకి చెందిన బీజేపీ నేత వినీత్ అగర్వాల్. ఢిల్లీలోకి పాక్, చైనా దేశాలు విష వాయువులను వదిలి ఉంటాయంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశానికి భయపడుతూ.. ఇరు దేశాలు ఈ దారుణానికి ఒడిగడుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. మనతో ప్రత్యక్షంగా తలపడలేక.. ఇలాంటి కుట్రలకు పాల్పుడుతున్నాయన్నారు. రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవ్వడం.. అమిత్ షా హోంమంత్రి కావడం.. ఇరు దేశాలకు మింగుడుపడటం లేదని.. అందుకే ఇలాంటి వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నాయన్నారు.

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కే్జ్రీవాల్‌పై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల రైతులు పంట వ్యర్థాలను దహనం చేయడం వల్లే ఈ వాయు కాలుష్యం పెరిగిందనడాన్ని కొట్టిపారేశారు. అవి అర్ధరహిత వ్యాఖ్యలన్నారు. అంతేకాదు.. రైతులు దేశానికి వెన్నెముకలాంటి వారని.. వారిని నిందించడం తగదంటు హితవు పలికారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu