రూ.50 కి 16 టెస్టులు.. 6 నిమిషాల్లోనే రిపోర్టులు.. ఎక్కడంటే…?

నేడు ఏ జబ్బు చేసిన.. తొలుత టెస్టులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. జబ్బు చిన్నదైనా సరే.. కొందరు డాక్టర్లు మాత్రం టెస్ట్‌లు రాసి.. విపరీతమైన డబ్బులను దండుకుంటున్నారు. అయితే పలు చిన్న చిన్న టెస్టులకు కూడా వందలు.. వేల రూపాయలను చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ప్రయాణ సేవలతో పాటుగా.. వైద్య సేవలు కూడా ప్రారంభించింది. రైల్వే ప్రయాణికుల కోసం హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. దీంతో తక్కువ ధరకే పలు […]

రూ.50 కి 16 టెస్టులు.. 6 నిమిషాల్లోనే రిపోర్టులు.. ఎక్కడంటే...?
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 07, 2019 | 5:49 AM

నేడు ఏ జబ్బు చేసిన.. తొలుత టెస్టులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. జబ్బు చిన్నదైనా సరే.. కొందరు డాక్టర్లు మాత్రం టెస్ట్‌లు రాసి.. విపరీతమైన డబ్బులను దండుకుంటున్నారు. అయితే పలు చిన్న చిన్న టెస్టులకు కూడా వందలు.. వేల రూపాయలను చెల్లించాల్సి వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ప్రయాణ సేవలతో పాటుగా.. వైద్య సేవలు కూడా ప్రారంభించింది. రైల్వే ప్రయాణికుల కోసం హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. దీంతో తక్కువ ధరకే పలు హెల్త్ చెకప్‌లు చేయించుకునే వీలు కల్పించింది.

ఫిట్ ఇండియా కార్యక్రమం టార్గెట్‌ను చేరుకునేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైలు ప్రయాణం చేసే వారి కోసం.. ప్రతీ రైల్వే స్టేషన్లలో ఈ హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం యూపీలోని లక్నో రైల్వే స్టేషన్లో ఈ హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది.

లక్నో రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ ఏటీఎంలు.. దాదాపు 16 హెల్త్ చెకప్‌ సర్వీసులు అందిస్తుంది. ఈ చెకప్‌ల కోసం.. రూ.50-రూ.100 చెల్లిస్తే చాలు.. ఇందులో రెండు రకాల హెల్త్ చెకప్‌లు ఉంటాయి. అందులో ఒకటేమో 9 నిమిషాల చెకప్. మరోకటి 6 నిమిషాల చెకప్. ఈ 9 నిమిషాల చెకప్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదే 6 నిమిషాల చెకప్‌ కోసం రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ హెల్త్ చెకప్‌లో.. బాడీ మాస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెజర్, బాడీ ఫ్యాట్, హీమోగ్లోబిన్, మెటబాలిక్ ఏజ్, మజిల్ మాస్, వెయిట్, హైట్, టెంపరేచర్, బసల్ మెటబాలిక్ రేటింగ్, ఆక్సిజన్ శాచురేషన్, పల్స్ రేట్, బ్లడ్ గ్లూకోజ్, బోన్ మాస్ వంటివి ఉంటాయి. ఇక ఈ హెల్త్ చెకప్ రిపోర్ట్‌ను వెంటనే పొందొచ్చు. అంతేకాదు.. స్మార్ట్‌ఫోన్‌‌కు మెయిల్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈ హెల్త్ ఏటీఎం ద్వారా.. రోజుకు 50 నుంచి 60 మంది వరకు ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఈ టెస్టులతో జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు.. ఇట్టే తెలుసుకోవచ్చు.

ఈ హెల్త్ ఏటీఎం కేంద్రాలు ఇప్పుడు కేవలం లక్నో స్టేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఇతర స్టేషన్లలో కూడా ఏర్పాటు చేసేందుకు ఇండియన్ రైల్వే సిద్ధం అవుతోంది. తక్కువ ధరకే ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం సామాన్య ప్రజానికానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారు.. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా.. సుదూర ప్రయాణాలు చేయాలా.. లేక విరమించుకోవాల అన్నది కూడా ఈ చెకప్‌లతో తేలిపోతుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu