హఫీజ్ సయీద్‌కి జైలు శిక్ష.. భారత్ ‘సందేహం’!

పాకిస్తాన్ గడ్డలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు, వారి సంస్థల విషయంలో కఠిన చర్యలు  తీసుకునేలా చూడాలని ఆ దేశాన్నిఇండియా కోరింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించాడన్న కేసులో ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కి లాహోర్ కోర్టు ఆరేళ్ళ జైలుశిక్ష విధించినట్టు వఛ్చిన వార్తలపై  స్పందించిన ప్రభుత్వం.. టెర్రరిజానికి మద్దతునిచ్ఛే వైఖరికి స్వస్తి చెప్పవలసిందిగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఏనాటి నుంచో కోరుతున్నట్టు పేర్కొంది. టెర్రరిస్టు సంస్థలకు ఇలాంటి ఉగ్రవాదుల నుంచి నిధుల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు […]

హఫీజ్ సయీద్‌కి జైలు శిక్ష.. భారత్ 'సందేహం'!
Follow us
Umakanth Rao

| Edited By: Srinu

Updated on: Feb 13, 2020 | 12:50 PM

పాకిస్తాన్ గడ్డలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు, వారి సంస్థల విషయంలో కఠిన చర్యలు  తీసుకునేలా చూడాలని ఆ దేశాన్నిఇండియా కోరింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించాడన్న కేసులో ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కి లాహోర్ కోర్టు ఆరేళ్ళ జైలుశిక్ష విధించినట్టు వఛ్చిన వార్తలపై  స్పందించిన ప్రభుత్వం.. టెర్రరిజానికి మద్దతునిచ్ఛే వైఖరికి స్వస్తి చెప్పవలసిందిగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఏనాటి నుంచో కోరుతున్నట్టు పేర్కొంది. టెర్రరిస్టు సంస్థలకు ఇలాంటి ఉగ్రవాదుల నుంచి నిధుల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించి ఏర్పాటైన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్లీనరీ మీటింగ్ జరగబోతున్న తరుణంలో.. పాక్ తాజాగా తీసుకున్న చర్యలోని నిజానిజాలను ప్రభుత్వం తెలుసుకోగోరుతోంది. పాక్ ను ఈ సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టడానికి కూడా ఆట్టే రోజులు లేవు. ఇతర ఉగ్రవాదుల  విషయంలో కూడా ఈ విధమైన చర్యలే తీసుకోవాలని, ‘మిస్టర్ క్లీన్ ‘ అనిపించుకోవాలని మీ దేశాన్ని కోరుతున్నామని భారత ప్రభుత్వం తెలిపింది.

ముంబైతో బాటు పఠాన్ కోట్ లో జరిగిన పేలుడు ఘటనలను ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు గుర్తు చేశాయి. ఓ నిషేధిత సంస్థకు నాయకత్వం వహిస్తున్నందుకు.. అక్రమ ఆస్తులను కలిగి ఉన్నందుకు తన క్లయింటును దోషిగా కోర్టు పేర్కొందని హఫీజ్ తరఫు లాయర్ ఇమ్రాన్ గిల్ తెలిపారు. అసలు ఈ కేసులో చెప్పుకోదగిన ముఖ్యమైన అంశాలేవీ లేవని, ఫైన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒత్తిడితోనే పాక్ ప్రభుత్వం అతనికి జైలుశిక్ష విధించిందని ఆయన చెప్పారు.

హఫీజ్ సయీద్ ని ఐక్యరాజ్యసమితి, అమెరికా కూడా గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాయి. అతని తలపై 10 మిలియన్ యుఎస్ డాలర్ల రివార్డు ప్రకటించాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉన్న జమాత్-ఉద్-దావాకు సయీద్ నాయకుడిగా ఉన్నాడు. ఈ ఉగ్రవాది విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం.. అంతర్జాతీయంగా ‘దోబూచులాడుతోందన్న’ విమర్శలు వినవస్తున్నాయి. ఇతగాడు ఆ దేశంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. కొన్ని సార్లు ఇతనికి  గృహ నిర్బంధం కూడా విధించారు. కానీ చాలా సందర్భాల్లో ఆ దేశంలో స్వేఛ్చగా సంచరిస్తూ వచ్చాడు కూడా. అయితే ఇతడిని ప్రాసిక్యూట్ చేయాలనీ ఇండియా ఎన్నోసార్లు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది.