AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chennai Hotel Goes Viral: అక్కడ 10 రూపాయలకే ప్లేట్ భోజనం.. రూ.30కి ఫుల్ మీల్స్..

Chennai Hotel Goes Viral: సాధారణంగా ఏసీ రెస్టారెంట్లలో భోజనం చేయాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుంది. అలాగే చిన్న హోటళ్లలో అయితే ఫుల్ మీల్స్ రూ.70 నుంచి రూ.100 ఉంటుంది. కానీ చెన్నైలోని ఓ హోటల్‌లో కేవలం రూ.10కే ప్లేట్ భోజనం.. అలాగే రూ.30కే ఫుల్ మీల్స్ లాగించేయవచ్చు. అదీ కూడా అక్కడ సిబ్బంది ఏసీ గదిలో వడ్డిస్తారు. రజనీకాంత్ అభిమాని ఒకరు చెన్నైలోని సాలి గ్రామంలో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నారు. స్థానిక కార్మికులకు, […]

Chennai Hotel Goes Viral: అక్కడ 10 రూపాయలకే ప్లేట్ భోజనం.. రూ.30కి ఫుల్ మీల్స్..
Ravi Kiran
|

Updated on: Feb 14, 2020 | 6:37 AM

Share

Chennai Hotel Goes Viral: సాధారణంగా ఏసీ రెస్టారెంట్లలో భోజనం చేయాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుంది. అలాగే చిన్న హోటళ్లలో అయితే ఫుల్ మీల్స్ రూ.70 నుంచి రూ.100 ఉంటుంది. కానీ చెన్నైలోని ఓ హోటల్‌లో కేవలం రూ.10కే ప్లేట్ భోజనం.. అలాగే రూ.30కే ఫుల్ మీల్స్ లాగించేయవచ్చు. అదీ కూడా అక్కడ సిబ్బంది ఏసీ గదిలో వడ్డిస్తారు. రజనీకాంత్ అభిమాని ఒకరు చెన్నైలోని సాలి గ్రామంలో ఈ హోటల్‌ను నిర్వహిస్తున్నారు.

స్థానిక కార్మికులకు, రోజువారీ కూలీలకు అందుబాటులో ఉండే రేట్లతో స్టార్ హోటళ్లకు ధీటుగా యాజమాన్యం ఈ హోటల్‌ను నడుపుతోంది. అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగను వడ్డిస్తూ పేదవారి ఆకలి తీరుస్తోంది. మధ్యాహ్నం వేళల్లో ఈ హోటల్ కిటకిటలాడుతుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతుండటంతో పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు అక్కడికి భోజనానికి వెళ్తున్నారు. ఇక ఆ హోటల్ యజమాని వీరబాబు మాట్లాడుతూ కేవలం సేవా దృక్పధంతోనే ఈ హోటల్‌ను పెట్టామని స్పష్టం చేశాడు. కాగా, రజనీకాంత్ వీరాభిమానులు మరికొందరు ఇలాంటి హోటల్స్‌ను తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!