‘పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో ఇన్ని కోట్లా’ ? పి. చిదంబరం ‘ఆశ్చర్యం’ !

పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో రూ. 3,076 కోట్లు వఛ్చి చేరాయని, ఆ విరాళాలు ఇఛ్చినవారి పేర్లను ఎందుకు వెల్లడించడంలేదని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ వెబ్ సైట్ లో 2020 ఆర్ధిక సంవత్సరానికి..

'పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో ఇన్ని కోట్లా' ? పి. చిదంబరం 'ఆశ్చర్యం' !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 02, 2020 | 8:22 PM

పీఎం కేర్స్ ఫండ్ కి 5 రోజుల్లో రూ. 3,076 కోట్లు వఛ్చి చేరాయని, ఆ విరాళాలు ఇఛ్చినవారి పేర్లను ఎందుకు వెల్లడించడంలేదని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ వెబ్ సైట్ లో 2020 ఆర్ధిక సంవత్సరానికి గాను మార్చి 27-31 మధ్య మాత్రమే  అందిన విరాళాల వివరాలను పొందుపరిచారని ఆయన పేర్కొన్నారు. ఈ 3.076 కోట్లు డొమెస్టిక్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ కాగా-రూ. 39. 67 లక్షలు విదేశీ విరాళాలని పేర్కొన్నారని ఆయన తెలిపారు. అడిట్ స్టేట్ మెంట్ ని అప్ లోడ్ చేసినప్పటికీ, దీనికి జోడించిన ఒకటి నుంచి ఆరు నోట్ ల వివరాలు ఎందుకు బహిర్గతం చేయడంలేదన్నారు. ఇంత ‘ఉదారంగా డొనేషన్స్’ ఇఛ్చినవారిని ఎందుకు ‘దాస్తున్నారని’ ఆయన ట్వీట్ చేశారు. ప్రతి ట్రస్ట్ కూడా డోనర్ల పేర్లను వెల్లడించాల్సి ఉంటుందన్నారు.