ఢిల్లీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత, ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన హైకోర్టు, ఇలా అయితే ఎలా ?,
ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమవుతోంది. కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం, బెడ్ల కొరతతో బాటు ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత మరికొన్ని గంటలకు మించి ఉండబోదని...
ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమవుతోంది. కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం, బెడ్ల కొరతతో బాటు ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత మరికొన్ని గంటలకు మించి ఉండబోదని ఆసుపత్రి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. సరఫరా చాలావరకు తగ్గిపోతున్నట్టు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితిపై ఓ వ్యక్తి దాఖలు చేసిన పిల్ మేరకు ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. పరిస్థితి ఇంతవరకూ వచ్చేకారకు మీరేం చేస్తున్నారని ప్రశ్నించింది. ముందు చూపు లేదని దుయ్యబట్టింది. మంగళవారం ఒక్కరోజే నగరంలో 32 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆక్సిజన్, వ్యాక్సిన్ల లభ్యత, పంపిణీపై అసలు మీ పాలసీ ఏమిటని కూడా కోర్టు ప్రశ్నించింది. పెట్రోలియం, స్టీల్ వంటి పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాను కుదించాలని, మొదట ఆసుపత్రుల్లోని రోగుల పట్ల ఉదారత చూపాలని న్యాయస్థానం సూచించింది. మనుషుల ప్రాణాలకన్నా ఆర్థిక ప్రయోజనాలు మిన్న కాదని, ఇప్పటికే సమయం మించిపోయిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
తాము కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడామని, వారు కూడా రోగుల అవసరాలకు తగినట్టు ఆక్సిజన్ కేడని వారు చెప్పారని జడ్జీలు పేర్కొన్నారు.