PM Narendra Modi: ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలోనే : ప్రధాని మోడీ
కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి అయన వివరించారు.
PM Narendra Modi: కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్, వయోవృద్ధులకు ప్రధమ ప్రియరిటీతొ టీకాలు వేశామని తెలిపారు. కరోనాపై పోరులో అన్ని రాష్ట్రాల నుంచి సహకారం బాగా అందుతోందని రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించారు. కరోనా వచ్చిన కొత్తలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని.. అయినా ధైర్యంగా ముందడుగు వేశామనీ ప్రధాని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశం భారత్ అని వెల్లడించారు. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. చాలా తక్కువ సమయంలోనే కోట్ల మందికి టీకాలు వేశామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉచిత వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకగా భారత్ వ్యాక్సిన్ అందిస్తోంది అని ప్రధాని మోడీ వెల్లడించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రాలు చివరి అస్త్రంగా మాత్రమె లాక్ డౌన్ ను పరిగణించాలని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని చెప్పారు. అంతకు మందు అయన మాట్లాడుతూ దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని మోదీ అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని, అనేక ప్లాంట్లు నెలకొల్పామని ఆయన వెల్లడించారు. కొన్నాళ్లుగా వైరస్‌పై కఠినమైన పోరాటం చేస్తున్నాం. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతోంది. మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా .. అందరూ జాగ్రత్తగా ఉండాలి. కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలి. అని ఆయన ఆకాంక్షించారు.
ప్రధాని ప్రసంగం పూర్తిగా ఇక్కడ చూడండి..
Also Read: PM Narendra Modi: అపార్ట్‌మెంట్లలో కమిటీలుగా ఏర్పడితే కంటైన్‌మెంట్ జోన్లే అవసరం ఉండదు: ప్రధాని మోదీ
PM Modi: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం