PM Modi Speech: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
PM Narendra Modi: యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా విజృంభిస్తుండటంతో కేం..
PM Narendra Modi Speech: యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుందని చెబుతున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనాపై జాతినుద్దేశించి మాట్లాడారు. గత ఏడాది కాలంగా కరోనాతో కలిసి పోరాటం చేస్తున్నామని అన్నారు. దేశం అతిపెద్ద యుద్ధం చేస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఓ తుఫానుల దూసుకొచ్చిందన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దని, దేశంలో ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందన్నారు. కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోడీ తన సందేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ..ఆక్సిజన్ సరఫరా.. అదేవిధంగా లాక్ డౌన్ కు సంబంధించిన విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించిన ప్రధాని మోడీ.. ఈరోజు అన్ని విషయాలను ప్రజల ముందుంచే అవకాశం కనిపిస్తోంది.
The demand for oxygen has increased in many parts of the country. The Centre, state govt, private sector are trying to make oxygen available to all those who are in need of it. Many steps are being taken in this direction: PM Modi pic.twitter.com/0UNXSjVmV7
— ANI (@ANI) April 20, 2021
Also Read: PM Narendra Modi LIVE: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం