PM Narendra Modi Speech Highlights: చివరి అస్త్రంగా లాక్‌డౌన్ వాడాలి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచన
కరోనా వైరస్ రెండో వేవ్‌లో విరుచుకుపడుతున్న వేళ ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే భావించాలన్నారు ప్రధాని.
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా ఇబ్బందుల నేపధ్యంలో పలు కీలక చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తుందని చెబుతున్నారు.
రెండో దశలో కరోనా తుపానులా విరుచుకుపడుతోందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధపడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా అందరూ జాగ్రత్తగా ఉండాలని మోదీ కోరారు. దేశంలో ఇప్పటివరకు 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందన్నారు. దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు.
LIVE NEWS & UPDATES
-
❁ కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు, మెడికల్ అవసరాలు అన్నింటిని కొరత లేకుండా చూస్తున్నాం.
❁ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఔషధ సంస్థలు భారత్‌లో ఉన్నాయి. దేశంలో కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు.
❁ ఇటీవల మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో పరిస్థితులను చక్కదిద్దుతాయిః ప్రధాని మోదీ
❁ కరోనాను నియంత్రించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు
❁ లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకుందాం
❁ కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే భావించాలి
❁ తమ పరిసరాల్లో కొంత మంది కలిసి చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి కోవిడ్‌పై అవగాహన కల్పించాలి
❁ దేశంలోని యువతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విజ్ణప్తి చేశారు.
❁ దేశాన్ని లాక్‌డౌన్ బారిన పడుకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
❁ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రెండు స్వదేశీ కోవిడ్ టీకాలు తయారయ్యాయని.. వీటి సాయంతో ప్రపంచంలోనే అతి పెద్ద టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతోంది
❁ దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందింది
❁ మనం తీసుకున్న నిర్ణయాలే మన భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులు రాకుండా చక్కదిద్దుతాయి.
❁ దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని,ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు చేపడుతున్నాం
❁ దేశంలో ఆక్సిజన్ డిమాండ్ భారీగా పెరిగింది. అందరికీ సరపడా ఆక్సిజన్ అందించేందుకు కృషీ చేస్తున్నాం
❁ దేశవ్యాప్తంగా వేగంగా అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేశాం.
❁ మే 1 నాటికి 18 ఏళ్లు పైబడి వారందరికీ వ్యాక్సిన్ అందిస్తాం
❁ అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించుకోగలం
❁ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందిః మోదీ
❁ గతంతో పోలిస్తే ప్రస్తుతం విస్తరిస్తున్న కోవిడ్ చాలా భిన్నమైనదని, దీనిపై అందరం కలిసి పోరాడాలి
❁ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్నారు. కరోనా రెండో వేవ్ లో ఎదుర్కుంటున్నాంః మోదీ
❁ ఆక్సిజన్ సమస్యపై ప్రధాని మాట్లాడుతూ ఆక్సిజన్ కోసం ప్రస్తుతం ఇబ్బంది లేదని చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరాను పెంచామని చెప్పారు.దేశ ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు చాలా బాధ కలిగిస్తున్నాయి.
❁ కరోనా మహమ్మారిపై ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నాంః ప్రధాని మోదీ
❁ దేశంలో ఆక్సిజన్ కొరత లేదు. కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాంః ప్రధాని
❁ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తోటివారికి సాయం అందించాలిః ప్రధాని
-
దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతుండటంతో.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది
-
Published On - Apr 20,2021 9:33 PM