భారత్ బయో టెక్ వినూత్న నిర్ణయం, కోవిడ్ కేసుల వెల్లువ, ఏడాదికి 70 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తికి సన్నాహాలు

దేశంలో కోవిడ్ కేసులు  విపరీతంగా పెరిగిపోతున్న వేళ.. హైదరాబాద్ లోని  భారత్ బయో టెక్ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 70 కోట్ల డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలనీ సంకల్పించింది.

భారత్ బయో టెక్ వినూత్న నిర్ణయం,  కోవిడ్ కేసుల వెల్లువ, ఏడాదికి 70 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తికి సన్నాహాలు
Bharat Biotech's Covaxin
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 21, 2021 | 7:39 AM

దేశంలో కోవిడ్ కేసులు  విపరీతంగా పెరిగిపోతున్న వేళ.. హైదరాబాద్ లోని  భారత్ బయో టెక్ సంస్థ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 70 కోట్ల డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలనీ సంకల్పించింది. హైదరాబాద్ తో బాటు వంటి ఇనాక్టివేరేడ్త మ కంపెనీ నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున టీకామందు ఉత్పాదనకు నడుం బిగించింది.  దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో వేలాది మరణాలను అరికట్టేందుకు, వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు అవసరమైతే సాలుకు 70 కోట్ల డోసులకు మించి టీకామందును ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం విదేశీ సంస్థలతో టై అప్ అవుతామని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి.   దశలవారీగా ఈ ఉత్పాదన జరగనుందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఐసీఎంఆర్ తోను, నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీతోను కలిసి భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

కొవాగ్జిన్ వంటి ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ సురక్షితమైనదని  భారత  డీజీసీఐ వంటి రెగ్యులేటర్లు ఇదివరకే పేర్కొన్నాయి. విదేశి ప్రమోటర్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే తాము త్వరలో పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్ ఉత్పాదనపై దృష్టి నింపుతామని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి.