Letter to PM Modi: విద్వేషపూరిత రాజకీయాలు ఆపండి.. మీ మౌనం మంచిది కాదు.. ప్రధాని మోదీకి మాజీ ఉన్నతాధికారుల లేఖ
దేశంలో విద్వేషపూరిత రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీకి వందకు పైగా మాజీ ఉన్నతాధికారులు లేఖ రాశారు. : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు.
Bureaucrats ‘open letter’ to PM Narendra Modi: దేశంలో విద్వేషపూరిత రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రధాని మోదీకి వందకు పైగా మాజీ ఉన్నతాధికారులు లేఖ రాశారు. : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయని ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఆరోపించారు. ముస్లింలు, ఇతర మైనారిటీలతో పాటు రాజ్యాంగాన్ని సైతం ధ్వంసం చేస్తున్న ఇలాంటి చర్యలకు ముగింపు పలికేలా చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.
108 మంది మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రధానికి బహిరంగ లేఖ రాశారు. అస్సాం, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, ఈ రాష్ట్రాలన్నీ బీజేపీ అధికారంలో ఉన్నవేనని గుర్తుచేశారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకొంటున్న ఈ ఏడాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ల్లో విద్వేష రాజకీయాలకు ముగింపు పలుకాలని విజ్ఙప్తి చేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లే , మాజీ విదేశాంగశాఖ కార్యదర్శి సుజాతసింగ్ ఉన్నారు.
గతంలో ఎంతో బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించిన తాము ఇలాంటి లేఖ రాయాల్సి వస్తుందని ఊహించలేదని లెటర్‌లో పేర్కొన్నారు. తాజా పరిస్థితులకు భయపడే తాము ఈ లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు.సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అని మీరు చెబుతుంటారని … ఆ హామీని మనస్ఫూర్తిగా పూర్తి చేయాలని మోదీకి రాసిన లేఖలో మాజీ బ్యూరోక్రాట్లు విజ్ఞప్తి చేశారు.
YS Jagan Meeting: టార్గెట్ 2024.. మరోసారి అధికారమే లక్ష్యం.. వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం