YS Jagan Meeting: టార్గెట్ 2024.. మరోసారి అధికారమే లక్ష్యం.. వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం
టార్గెట్ 2024.. మరోసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.
AP CM YS Jagan Mohan Reddy Meeting: టార్గెట్ 2024.. మరోసారి అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలె పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులు చేపట్టారు సీఎం జగన్. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పార్టీలో బాధ్యతలు అప్పగించిన నాయకులందరితోనూ సీఎం జగన్ సమావేశం అయ్యారు.ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశమివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. పాలనలో దూకుడు కొనసాగిస్తూనే.. పార్టీపైనా ఫోకస్ పెట్టారు సీఎం జగన్. మొన్నటికి మొన్న రీజినల్ కో-ఆర్డినేటర్ల నియామకాన్ని చేపట్టిన అధినేత.. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. నేతల మధ్య సమన్వయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు సీఎం.
రీజినల్ కో-ఆర్డినేటర్ల ప్రకటన తర్వాత.. సీఎం జగన్ పార్టీపరంగా నిర్వహిస్తోన్న మొదటి సమావేశమిది. ఈ కీలక సమావేశానికి మంత్రులతో పాటు రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు సైతం హాజరయ్యారు. పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. గడపగడపకూ వైసీపీ.. ఇదీ సీఎం జగన్ నినాదం.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జనం వద్దకు వెళ్లాలని డిసైడయ్యారు సీఎం. మే 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరించేలా ప్రణాళిక రచించారు. ప్రభుత్వ సాయం పొందిన లబ్ధిదారుల జాబితాతో జనం వద్దకు వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
పార్టీలో బాధ్యతలు అప్పగించిన నాయకులందరితోనూ సీఎం జగన్ సమావేశం నిర్వహించడం వైసీపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎన్నికలే లక్ష్యంగా సీఎం వైఎస్ పార్టీ నేతలకు..శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రీజినల్, జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారికి నియోజకవర్గాల వారిగా టార్గెట్ ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ వునర్‌వ్యవస్థికరణలో భాగంగా పార్టీలో చెలరేగిన అసంతృప్తులపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. అలాగే పార్టీలో ఎవరైనా నేతలు గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో ఏ టైంలో అయినా ఎలక్షన్‌లు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశస్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో..ఏ క్షణమైనా ఎలక్షన్‌లు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. నిజయోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరు పట్ల వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలిందని సమాచారం. నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
రాబోయే ఎన్నికలకు పార్టీ నేతల సమన్వయంతో పనిచేసి ముందుకెళ్లేలా కార్యచరణను సీఎం వైఎస్ జగన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారానికి కనీసం 10 నుంచి 15 గ్రామ..వార్డు సచివాలయాలను సందర్శించి..వాటి పనితీరుపై సమీక్షలు జరిపేలా కార్యక్రమాలను రూపొందించారు సీఎం జగన్. వచ్చే నెల 2వ తేదీ నుంచి గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఇవాళ జరగబోయే పార్టీ విస్తృస్ధాయి సమావేశంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ త్వరలో జిల్లాల్లో పర్యటనలు చేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాజకీయాల్లో కీలకంగా మారిన ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో వైసీపీతో సంబంధాలపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలతో సీఎం వైఎస్ జగన్ నిర్వహించబోయే సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. Read Also…. Harish Rao: బీజేపీ నేతల మాటలకు మైకులు పగిలిపోతాయి తప్పా.. పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదుః హరీష్ రావు