“పీవోకే”లో 20 ఉగ్రశిబిరాలు.. ఇండియన్ ఆర్మీ ప్లాన్ అదుర్స్..!
దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ.. కుట్రలకు పూనుకుంటుంది. పాక్ సైన్యంలోని బీఏటీ (బోర్డర్ యాక్షన్ టీమ్) అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాక్ దుష్ట పన్నాగాలను.. ఆరంభంలోనే ఎప్పటికప్పుడు తుంచేస్తున్నామని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దులో పాక్ చేస్తున్న కుట్రలను వివరించారు. పాక్ బీఏటీ తన ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నించడానికి ముందే..ఇండియన్ ఆర్మీ వారి ప్లాన్లకు చెక్ పెడుతోందన్నారు. వారి పన్నాగాల […]
దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ.. కుట్రలకు పూనుకుంటుంది. పాక్ సైన్యంలోని బీఏటీ (బోర్డర్ యాక్షన్ టీమ్) అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాక్ దుష్ట పన్నాగాలను.. ఆరంభంలోనే ఎప్పటికప్పుడు తుంచేస్తున్నామని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దులో పాక్ చేస్తున్న కుట్రలను వివరించారు. పాక్ బీఏటీ తన ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నించడానికి ముందే..ఇండియన్ ఆర్మీ వారి ప్లాన్లకు చెక్ పెడుతోందన్నారు. వారి పన్నాగాల గురించి.. తమకు ఎప్పటికప్పుడు పక్కా సమాచారం అందుతోందని.. దీంతో వారి ప్లాన్లను ఆదిలోనే తుంచేస్తున్నామన్నారు.
ఇక పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు ( పీవోకే )లో దాదాపు 20 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని.. వీటిలో దాదాపు 250 నుంచి 350 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. అటు పాక్ బోర్డర్ యాక్షన్ టీంలో.. పాక్ సైన్యంతో పాటుగా ఉగ్రవాదులు కూడా ఉంటారని తెలిపారు. అంతేకాదు.. జైషే మహ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రసంస్థలకు చెందిన ఉగ్రవాదులు కూడా బీఏటీలో ఉంటారన్నారు. వీరంతా భారత్‌లోని సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని తెలిపారు.
ఇక ఢిల్లీ కంటోన్మెంట్‌లో “తల్ సేన భవన్” ఏర్పాటు అంశం.. మంచిదేనని.. అన్ని సైనిక ప్రధాన కార్యాలయాలు ఒకే గొడుగు క్రిందకు రావడం వల్ల పని సామర్థ్యం మెరుగుపడుతుందని ఆర్మీ చీఫ్ నరవనే అన్నారు.