షాకింగ్.. మఠానికి ప్రధాన పూజారిగా ముస్లిం యువకుడు.. ఎక్కడంటే..?
హిందూ మతానికి సంబంధించిన ఓ మఠానికి ముస్లిం యువకుడు పూజారిగా నియుక్తుడయ్యాడు. అది కూడా మరెక్కడో కాదు.. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనే. వివరాల్లోకి వెళితే.. మురుగ రాజేంద్ర లింగాయత్ మఠం ప్రధాన పూజారిగా దివాన్ షరీఫ్ ముల్లా అనే ముస్లిం వ్యక్తిని ఎంచుకున్నారు. అయితే షరీఫ్ కుటుంబం ఎప్పటినుంచో ఈ లింగాయత్ మఠానికి నిత్యం వచ్చేవారని తెలుస్తోంది. వారంతా లింగాయత్ మఠానికి పరమ భక్తులుగా కొనసాగుతూ వస్తున్నారట. అంతేకాదు.. ఓ ఏడాది క్రితం మఠానికి విరాళంగా […]
హిందూ మతానికి సంబంధించిన ఓ మఠానికి ముస్లిం యువకుడు పూజారిగా నియుక్తుడయ్యాడు. అది కూడా మరెక్కడో కాదు.. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోనే. వివరాల్లోకి వెళితే.. మురుగ రాజేంద్ర లింగాయత్ మఠం ప్రధాన పూజారిగా దివాన్ షరీఫ్ ముల్లా అనే ముస్లిం వ్యక్తిని ఎంచుకున్నారు. అయితే షరీఫ్ కుటుంబం ఎప్పటినుంచో ఈ లింగాయత్ మఠానికి నిత్యం వచ్చేవారని తెలుస్తోంది. వారంతా లింగాయత్ మఠానికి పరమ భక్తులుగా కొనసాగుతూ వస్తున్నారట. అంతేకాదు.. ఓ ఏడాది క్రితం మఠానికి విరాళంగా రెండెకరాల స్థలాన్ని కూడా అప్పగించారట. ఈ క్రమంలో.. మఠం అధికారులు షరీఫ్‌కు మఠ ప్రధాన పూజారిగా బాధ్యతలు అప్పగించారు. యజ్ఞోపవీతం వేసి.. ఇష్టలింగంతో పాటు బాధ్యలను కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. ఇష్ట లింగాన్ని మెడలో వేసుకోవడానికి నేను ఇష్టపడతానని..తాను ధర్మం ప్రకారమే నడుచుకుంటూ, ప్రేమను, త్యాగాన్ని ప్రచారం చేస్తానని ప్రకటించారు.
ఇక ఈ విషయంపై మఠానికి చెందిన స్వామీజీని అడగ్గా.. నియమించే వ్యక్తి ఏ మతానికి చెందిన వాడన్నదానితో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సన్మార్గంతో పాటు.. త్యాగ మార్గంలో దేవుడు కనుక కనిపిస్తే, మనిషి సృష్టించిన కుల, మతాలకు సంబంధం లేదని మఠానికి సంబంధించిన స్వామీజీ ప్రకటించారు.
Dewan Sharief Mullah: They’ve put the sacred thread & given me the responsibility. They’ve given me the ‘Ishta-linga’ & this honour. I’ve done the ‘Ishta-linga dharan’. I’ll walk on the path of dharma. Love & sacrifice is the message given to me, that is what I want to propagate. https://t.co/En3mmHv8k3 pic.twitter.com/moyZHOe5us
— ANI (@ANI) February 20, 2020
Sri Murugarajendra Koraneswara Swami: It doesn’t matter what caste you belong to. If God appears to you for a path of goodwill and sacrifice, you will do it regardless of the manmade restrictions of birth and caste. (19.02) pic.twitter.com/Gro2dRFvVN
— ANI (@ANI) February 20, 2020