AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదంపై విజయమే కాదు.. డబ్బు రూపంలో ఇండియాకు వేల కోట్ల లాభం! ఎలాగంటే..?

ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులను వివరిస్తుంది. ఈ దాడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. దీని ఫలితంగా భారత రక్షణ ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ప్రాముఖ్యత ను ఈ సంఘటన చాటింది.

ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదంపై విజయమే కాదు.. డబ్బు రూపంలో ఇండియాకు వేల కోట్ల లాభం! ఎలాగంటే..?
Pm Modi
SN Pasha
|

Updated on: May 16, 2025 | 1:30 PM

Share

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మొపుతూ భారత్‌ మే 6,7 తేదీల మధ్య రాత్రి పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మొత్తం 9 స్థావరాలపై వైమానికి దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ దాడులతో పాకిస్థానే కాదు భారత శక్తిని చూసి యావత్‌ ప్రపంచమే ఉలిక్కిపడింది. సహనంతో ఉండే దేశాన్ని గెలికితే ఎలా ఉంటుందో చూపించింది. అయితే ఉగ్రవాదులపై చేసిన ఈ దాడులకు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ అని పేరు పెట్టింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు వంతపాడుతూ భారత్‌పై సైనిక దాడులకు ప్రయత్నించినా.. వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

ఆ విషయం పక్కనపెడితే.. ఆపరేషన్‌ సిందూర్‌తో ఏం సాధించాం అని ఆలోచిస్తే.. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారుతున్న 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదంపై భారత్‌ సాధించిన విజయంగా అభివర్ణించవచ్చు. అదే ఆపరేషన్‌ సిందూర్‌ ప్రధాన లక్ష్యం కూడా. అయితే.. కేవలం ఉగ్రవాదులపై విజయమే కాదు.. మంచి చేస్తే మరింత మంచి జరుగుతుంది అన్నట్లు ఇండియాకు వేల కోట్ల లాభం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆపరేషన్‌ సిందూర్‌తో మన ఎయిర్‌ ఫోర్స్‌ సాధారణ పౌరులకు ఏమాత్రం నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. గురి తప్పుకుండా క్షిపణులు ప్రయోగించింది. అంటే టార్గెట్‌ మిస్‌ కాకుండా కచ్చితత్వంతో దాడులు చేసింది.

అలాగే పాకిస్థాన్‌ ఎదురుదాడికి తిగితే.. వారి డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో తిప్పి కొట్టాం. భారత భూభాగంలో కూలిన డ్రోన్లు, క్షిపణుల ముక్కలను పరిశీలిస్తే.. PL-15 క్షిపణుల ముక్కలు (చైనీస్ మూలం) “యిహా” లేదా “యెహా” అని పిలువబడే టర్కిష్-మూలం UAVలు, దీర్ఘ-శ్రేణి రాకెట్లు, క్వాడ్‌కాప్టర్లు, వాణిజ్య డ్రోన్‌ స్వాధీనం చేసుకుని గుర్తించారు. అవి టర్కీ, చైనా తయారు చేసినవిగా తేలింది. అంటే.. ఆ దేశాల రక్షణా వస్తువులను, ఆయుధాలను భారత్‌ నాశనం చేసి.. వాటి కంటే శక్తివంతమైన ఆయుధ సామాగ్రి, డిఫెన్స్‌ వ్యవస్థ మన వద్ద ఉందని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే వాటిలో కొన్ని మనం ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్నవి ఉన్నా.. మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఆకాశ్‌ వంటి డిఫెన్స్‌ వ్యవస్థ, తేజస్‌ వంటి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.

భారత్‌ సొంతంగా తయారు చేసుకున్న యుద్ధ సామాగ్రి బలమేంటో తెలిసిన ప్రపంచ దేశాలు మన నుంచి వీటిని కొనుగోలు చేసే అవకాశం పెరిగింది. గతేడాది రూ.23 వేల కోట్ల విలువైన డిఫెన్స్‌ ఎగుమతులు చేసిన భారత్‌, ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా అవి రూ.50 వేల కోట్లుకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు దాదాపు రూ.24,000 కోట్ల రికార్డును దాటాయి. 2029 నాటికి ఈ సంఖ్యను రూ.50,000 కోట్లకు పెంచడం, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఎగుమతిదారుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

మేక్ ఇన్ ఇండియా..

మేక్ ఇన్ ఇండియా చొరవ, ఆత్మనిర్భర్‌ భారత్‌ బలమైన ప్రోత్సాహం ద్వారా ఇండియా ఒక ప్రధాన రక్షణ తయారీ కేంద్రంగా అవతరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వదేశీ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.23,622 కోట్లకు పెరిగాయి. ఇది 2013–14 నుండి 34 రెట్లు ఎక్కువ. వ్యూహాత్మక సంస్కరణలు, ప్రైవేట్ రంగ ప్రమేయం, బలమైన పరిశోధన, అభివృద్ధి అధునాతన సైనిక వేదికల అభివృద్ధికి దారితీశాయి.

  • ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్
  • అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ATAGS)
  • ప్రధాన యుద్ధ ట్యాంక్ (MBT) అర్జున్
  • లైట్ స్పెషలిస్ట్ వాహనాలు
  • హై మొబిలిటీ వాహనాలు
  • తేలికపాటి పోరాట విమానం (LCA) తేజస్
  • అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH)
  • లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (LUH)
  • ఆకాశ్ క్షిపణి వ్యవస్థ
  • ఆయుధ గుర్తింపు రాడార్
  • 3D టాక్టికల్ కంట్రోల్ రాడార్
  • సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో (SDR)
  • డిస్ట్రాయర్లు, స్వదేశీ విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్‌లు, ఫాస్ట్ పెట్రోల్ నౌకలు, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ మరియు ఆఫ్‌షోర్ పెట్రోల్ నౌకలు వంటి నావికా ఆస్తులు.

రికార్డు స్థాయిలో సేకరణ ఒప్పందాలు, iDEX కింద ఆవిష్కరణలు, SRIJAN వంటి డ్రైవ్‌లు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లతో ప్రభుత్వం ఈ వృద్ధికి మద్దతు ఇచ్చింది. LCH (లైట్ కంబాట్ హెలికాప్టర్లు), ప్రచంద్ హెలికాప్టర్లు, ATAGS (అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్‌కు ఆమోదం) వంటి కీలక కొనుగోళ్లు స్వదేశీ సామర్థ్యం వైపు మార్పును హైలైట్ చేస్తాయి. ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయాల కథ కాదు. ఇది భారతదేశ రక్షణ స్వదేశీకరణ విధానాలకు ధ్రువీకరణ. వాయు రక్షణ వ్యవస్థల నుండి డ్రోన్‌ల వరకు, కౌంటర్-యుఎఎస్ సామర్థ్యాల నుండి నెట్-కేంద్రీకృత యుద్ధ వేదికల వరకు, స్వదేశీ సాంకేతికత అత్యంత ముఖ్యమైన సమయంలో అందించింది. ప్రైవేట్ రంగ ఆవిష్కరణ, ప్రభుత్వ రంగ అమలు, సైనిక దృక్పథం కలయిక భారతదేశం తన ప్రజలను, భూభాగాన్ని రక్షించుకోవడమే కాకుండా 21వ శతాబ్దంలో హైటెక్ సైనిక శక్తిగా తన పాత్రను నొక్కి చెప్పడానికి వీలు కల్పించింది. భవిష్యత్ సంఘర్షణలలో, యుద్ధభూమి సాంకేతికత ద్వారా మరింతగా రూపుదిద్దుకుంటుంది. ఆపరేషన్ సిందూర్‌లో చూపిన విధంగా భారతదేశం సిద్ధంగా ఉంది, దాని స్వంత ఆవిష్కరణలతో సాయుధమైంది.

డ్రోన్ పవర్ వ్యాపారం

డ్రోన్ ఫెడరేషన్ ఇండియా (DFI), 550 కి పైగా డ్రోన్ కంపెనీలు, 5500 డ్రోన్ పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రముఖ పరిశ్రమ సంస్థ. 2030 నాటికి భారతదేశాన్ని ప్రపంచ డ్రోన్ హబ్‌గా మార్చడమే DFI లక్ష్యం. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ డ్రోన్, కౌంటర్-డ్రోన్ టెక్నాలజీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ, స్వీకరణ, ఎగుమతిని ప్రోత్సహిస్తుంది. DFI వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది, డ్రోన్ టెక్నాలజీని స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది. భారత్ డ్రోన్ మహోత్సవ్ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా