UPSC Job 2026 Calendar: యూపీఎస్సీ జాబ్ క్యాలండర్ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
2025-26 సంవత్సరానికి సంబంధించి వివిధ పోటీ పరీక్షల తేదీలకు సంబంధించిన జాబ్ క్యాలండర్‌ను తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల తేదీలు, నోటిఫికేషన్ విడుదల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఉంటాయి. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌ను..

హైదరాబాద్, మే 16: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి యేటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి వివిధ పోటీ పరీక్షల తేదీలకు సంబంధించిన జాబ్ క్యాలండర్‌ను తాజాగా యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల తేదీలు, నోటిఫికేషన్ విడుదల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఉంటాయి. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌ను గురువారం కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. యూపీఎస్సీ భర్తీ చేసే వివిధ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ 2025-26 ఇదే..
- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 20226 పరీక్ష మే 24న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21న జరగనున్నాయి.
- యూపీఎస్సీ సీఎస్ఈ 2026 నోటిఫికేషన్ జనవరి 14న విడుదల, ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (యూపీఎస్సీ ఎన్డీఏ/ఎన్ ఏ, సీడీఎస్ 1) ప్రవేశ పరీక్ష 2026 ఏప్రిల్ 12న జరగుతుంది.
- ఐఈఎస్ 2026 నోటిఫికేషన్ 2026 ఫిబ్రవరి 11న విడుదల, మార్చి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 9వ తేదీన రాత పరీక్ష నిర్వహణ.
- సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 18న విడుదల, మార్చి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూలై 19న రాత పరీక్ష.
- యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) 2026 పరీక్ష జూలై 19న నిర్వహిస్తారు.
యూపీఎస్సీ జాబ్ క్యాలండర్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




