TS Inter Supply Hall Ticket 2025: మరో 2 రోజుల్లో ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి టైం టేబుల్ ఇదే
ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4,12,724 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వారిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మందిచ ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఇక ఇంటర్ సెకండియర్‌లో జనరల్ పరీక్షలకు 1,34,341 మంది, ఒకేషనల్ విద్యార్థులు 12,357 మంది విద్యార్ధులు..

హైదరాబాద్, మే 16: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4,12,724 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వారిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మందిచ ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఇక ఇంటర్ సెకండియర్‌లో జనరల్ పరీక్షలకు 1,34,341 మంది, ఒకేషనల్ విద్యార్థులు 12,357 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించారు. నిజానికి, ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో తప్పిన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మంది మాత్రమే అయినా.. వీరిలో మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు అధిక సంఖ్యలో ఉండటంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య అమాంతం పెరిగింది.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇప్పటికే సబ్జెక్టుల వారీగా తేదీలతో సహా పూర్తి షెడ్యూల్‌లు జారీ చేసింది. ఇంటర్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన 10 నుంచి 15 రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలను కూడా జారీ చేయనుంది.
ఇంటర్ ఫస్టియర్ (జనరల్, ఒకేషనల్) 2025 సప్లిమెంటరీ టైమ్ టేబుల్ ఇదే..
- మే 22 తేదీన పార్ట్-2: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
- మే 23 తేదీన పార్ట్-1, ఇంగ్లీష్ పేపర్ 1
- మే 24 తేదీన పార్ట్-3, మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1
- మే 25 తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- మే 26 తేదీన ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్ 1
- మే 27 తేదీన కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
- మే 28 తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 (BiPC విద్యార్థులకు)
- మే 29 తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1
ఇంటర్ సెకండియర్ (జనరల్, ఒకేషనల్) 2025 సప్లిమెంటరీ టైమ్ టేబుల్..
- మే 22 తేదీన పార్ట్ 2, సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
- మే 23 తేదీన పార్ట్ 1, ఇంగ్లీష్ పేపర్ 2
- మే 24 తేదీన పార్ట్ 3: మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2
- మే 25 తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జంతుశాస్త్రం పేపర్ 2, చరిత్ర పేపర్ 2
- మే 26 తేదీన ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
- మే 27 తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్ 2 (BiPC విద్యార్థులకు)
- మే 29 తేదీన మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, భౌగోళిక శాస్త్రం పేపర్ 2
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




