AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆమే నిలువెత్తు బంగారం.. ఇక ఎందులకు వరకట్నం.. రూ.31 లక్షలు తిరిగిచ్చేసిన వరుడు!

న్యాయవాది వికాస్ రాణా అనేక కేసులను కోర్టుల్లో వాదించి గెలిచి ఉండవచ్చు. కానీ తన పెళ్లి వేడుకలో ఆయన చేసిన పనితో అందరి మనసులు గెలుచుకున్నాడు. వధువు కుటుంబం భరణంగా ఇచ్చిన రూ 31 లక్షలను తిరిగి ఇచ్చేసిన వికాస్... వారి నుంచి కొబ్బరికాయ, ఒక రూపాయి నాణెంను కట్నంగా స్వీకరించాడు.

Viral: ఆమే నిలువెత్తు బంగారం.. ఇక ఎందులకు వరకట్నం.. రూ.31 లక్షలు తిరిగిచ్చేసిన వరుడు!
Vikas With His Wife Agrika
Ram Naramaneni
|

Updated on: May 03, 2025 | 9:32 AM

Share

సమాజంలో వరకట్న వేధింపులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఎందరో వివాహితలు ఈ వేధింపులు తాళలేక.. పుట్టింట్లో బాధలు చెప్పుకోలేదక.. లోకాన్ని వీడుతున్నారు. ఇలాంటి తరుణంలో, ఓ యువకుడు జెంటిల్‌మెన్‌లా ప్రవర్తించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కానుకగా అత్తమామలు ఇచ్చిన లక్షల రూపాయల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించి, వధువే తనకు అసలైన కానుక అని చాటి చెప్పాడు. ఈ సంఘటన హరియాణాలోని కురుక్షేత్రలో వెలుగుచూసింది.

ఉత్తరప్రదేశ్, సహారన్‌పూర్ జిల్లాలోని భాబ్సి రాయ్‌పుర్‌ గ్రామానికి చెందిన వికాస్ రాణా లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీపాల్ రాణా గతంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు.  వికాస్‌కు హర్యానాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో  పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం, ఏప్రిల్ 30న వికాస్ రాణా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కురుక్షేత్రకు చేరుకున్నారు. అక్కడి ఓ హోటల్‌లో వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.

వివాహ వేడుకలో భాగంగా తిలకం కార్యక్రమం జరుగుతుండగా, వధువు తల్లిదండ్రులు వరుడు వికాస్ రాణాకు సంప్రదాయం ప్రకారం రూ. 31 లక్షల నగదును కట్నంగా అందజేశారు. అయితే, ఆ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు వికాస్ వినయంగా నిరాకరించారు. తమకు కాబోయే కోడలు అగ్రికా తన్వరే అసలైన కానుక అని, అంతకు మించిన కట్నం తమకు అవసరం లేదని వికాస్‌ తండ్రి స్పష్టం చేశారు. వరుడి అభీష్టం మేరకు, కేవలం ఒక రూపాయి నాణెం, కొబ్బరికాయతో సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతును పూర్తి చేశారు. వరకట్నం కోసం ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వికాస్ రాణా తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇది సమాజానికి ఒక మంచి సందేశమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్