Viral video: ఇదెక్కడి మాస్‌రా మావా.. నడిరోడ్డుపై ప్రేమజంటను చితకబాదిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్!
స్కూటీపై వెళ్తున్న ఓ ప్రేమ జంటను రోడ్డుపై అడ్డగించి.. ఇద్దరు దంపతులు చితకబాదిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ కుమారుడు మరో యువతితో తిరుగుతుండగా చూసిన తల్లిదండ్రులు ఇద్దరిని అడ్డగించి రోడ్డుపైనే అందరూ చూస్తుండ కొట్టారు. ఈ ఘటన కాన్పూర్‌లోని గజాయిని స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్కూటీపై వెళ్తున్న ఓ ప్రేమ జంటను రోడ్డుపై అడ్డగించి.. ఇద్దరు దంపతులు చితకబాదిన ఘటన కార్నూర్ జిల్లాలోని గజాయిని పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంగోపాల్ కూడలిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… రోహిత్ అనే యువకుడు ఓ యువతితో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా రోహిత్ తన ప్రియరాలితో కలిసి ఉండగా చూసిన అతని తల్లిదండ్రులు శివకరణ్, సుశీలల.. వాళ్ల దగ్గరకు వచ్చారు. దీంతో తల్లిదండ్రులను చూసిన రోహిత్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే రోహిత్ అడ్డగించిన తల్లిదండ్రులు అతనితో పాటు ప్రియురాలిని పట్టుకొని కొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ యువతి మాయమాటలు చెప్పి రోహిత్‌ను వలలో వేసుకుందని అతని తల్లి ఆరోపిస్తోంది.
వీడియో చూడండి…
कानपुर- बेटा गर्लफ्रेंड घूमा रहा था, मां ने पकड़ लिया. बीच सड़क पर थपड़िया दिया. लोग तमाशा देखते रहे. pic.twitter.com/cDNtE9pcQZ
— Priya singh (@priyarajputlive) May 2, 2025
అయితే పైన చూస్తున్న వీడియో ప్రకారం… రోహిత్ అతని ప్రియురాలు బైక్‌పై ఉండగా అక్కడికి వచ్చిన అతని తల్లిదండ్రులు వారిని కొట్టడం స్టార్ట్ చేశారు. రోహిత్‌ను అతని తండ్రి చెప్పుతో కొడుతున్నట్టు వీడియో తెలుస్తోంది. అయితే రోహిత్ తల్లి అతని ప్రియురాలిని జుట్టు పట్టుకొని కొట్టడాన్ని కూడా మనం వీడియోలో చూడవచ్చు. పక్కనున్న వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఎలాంటి లాభం లేకపోయింది. ఇక స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పీస్‌కు తరలించారు. అక్కడ తల్లిదండ్రులతో పాలు ఆ ప్రేమ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపిచారు. ఈ విషయాన్ని పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
