AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ అలుపెరుగని కష్టం, వెనుక.. పార్టీ సీనియర్ల వెన్నుపోట్లు, వెరసి, ఐదు రాష్ట్రాల ఎన్నికలవేళ కాంగ్రెస్‌లో వితపోకడలు

Congress Party : ఓవైపు పార్టీ యువ నాయకుడు ఎన్నికల ప్రచారం చేస్తుంటే...మరోవైపు సీనియర్లు అసమ్మతిరాగం ఆలపించారు. సంస్థాగతంగా బలమైన కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతోందనే స్వరాన్ని బహిరంగ వేదికపై వినిపించారు...

రాహుల్ అలుపెరుగని కష్టం, వెనుక.. పార్టీ సీనియర్ల వెన్నుపోట్లు, వెరసి, ఐదు రాష్ట్రాల ఎన్నికలవేళ కాంగ్రెస్‌లో వితపోకడలు
Venkata Narayana
|

Updated on: Feb 28, 2021 | 10:31 PM

Share

Congress Party : ఓవైపు పార్టీ యువ నాయకుడు ఎన్నికల ప్రచారం చేస్తుంటే…మరోవైపు సీనియర్లు అసమ్మతిరాగం ఆలపించారు. సంస్థాగతంగా బలమైన కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడుతోందనే స్వరాన్ని బహిరంగ వేదికపై వినిపించారు. తమిళనాడులో రాహుల్‌ ప్రజలతో మమేకమవుతుంటే…జమ్మూలో బలప్రదర్శన చేశారు సీనియర్లు. ఇంకా గమ్మత్తు ఏంటంటే…ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు అజాద్. దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో పట్టుకోల్పోతున్న కాంగ్రెస్‌ని పటిష్టపరిచి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆపార్టీ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నవేళ ఈ వింతపోకడలు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ తట్టుకుంటూనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రాహుల్ గాంధీ. 234 స్థానాలకు గాను మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు.

అధికారంలో ఉన్న బీజేపీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తిరునల్వేలిలోని సెయింట్ ​జేవియర్​ కళాశాల ప్రొఫెసర్లతో మాట్లాడారు రాహుల్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థుల చర్చల నుంచి వచ్చిన విధానాలనే విద్యావ్యవస్థలో పొందుపరుస్తామన్నారు. అంతకు ముందు అరుల్ముగు నెలైపర్ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు రాహుల్ గాంధీ. ఎంతో పెద్ద శత్రువుగా ఉన్నటువంటి బ్రిటీష్ వాళ్లనే దేశం నుంచి తరిమికొట్టామని, మోదీని కూడా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాహుల్‌గాంధీ.

అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముంచుకొచ్చిన సమయంలో కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు మాత్రం కొత్త రాగాలు తీస్తున్నారు. జమ్మూలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో సీనియర్‌ నేత, అసమ్మతివాదుల నాయకుడు గులాంనబీ ఆజాద్‌ ఈ ‘శాంతి సమ్మేళనాన్ని’ ఏర్పాటు చేశారు. సోనియాకు రాసిన లేఖపై బహిరంగంగా చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రాంతాల వారిని సమానంగా గౌరవిస్తుందని తెలిపారు ఆజాద్. ఇదే వేదికపై ప్రధాని మోదీని ప్రశంసించారాయన. మోదీ తాను రాజ‌కీయంగా విరోధుల‌మే అయినా.. ఆయ‌న త‌న చిన్నత‌నంలో అనుభ‌వించిన పేద‌రికాన్ని దాచిపెట్టకుండా చెప్పుకోవ‌డాన్ని అభినందిస్తున్నాన‌ని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Read also : తమిళ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మోదీ మాటలు ఆపేసి.. చెవులకు పని చెప్పాలి, ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్స్