తమిళ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మోదీ మాటలు ఆపేసి.. చెవులకు పని చెప్పాలి, ప్రధాని మోదీకి రాహుల్ కౌంటర్స్
ఎన్నికల వేళ తమిళనాట కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్లు విసురుతున్నారు. అటు, బీజేపీ అగ్రనేతలు సైతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల..
ఎన్నికల వేళ తమిళనాట కాంగ్రెస్ పార్టీ కీలకనేత రాహుల్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్లు విసురుతున్నారు. అటు, బీజేపీ అగ్రనేతలు సైతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళ భాషపై అమితమైన అభిమానాన్ని ఒలకబోస్తున్నారు. ప్రజల్ని సెంటిమెంట్‌తో కొడుతున్నారు. ఈ క్రమంలో తన పర్యటనలలో మోదీని టార్గెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. తమిళభాషపై, సంస్కృతిపై ప్రధాని ప్రశంసలు కురిపిస్తుంటే….తన టూర్‌లో మోదీని టార్గెట్ చేసుకున్నారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. తమిళ ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మోదీ మాటలు ఆపేసి..చెవులకు పని చెప్పాలన్నారు రాహుల్‌గాంధీ.
అంతకుముందు రోజు కూడా తమిళ ప్రజల హృదయాలను గౌరవంతో, ప్రేమతో గెలుచుకోవాలని ప్రధానికి సూచించారు రాహుల్‌గాంధీ. తమిళనాడు సీఎం పళనిస్వామి ద్వారా తమిళనాడు రాష్ట్రాన్ని ప్రధాని మోదీ రిమోట్ కంట్రోల్‌తో పాలించాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రాన్ని ప్రధాని టెలివిజన్ అనుకుంటున్నారు. కానీ తమిళ ప్రజలు ఈ రిమోట్ నుంచి బ్యాటరీ తీసేసి ఆ రిమోట్‌ని అవతల పారేస్తారన్నారు రాహుల్‌గాంధీ. తమిళనాడులో ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న వేళ రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
Read also : తమిళ భాషపై టన్నుల కొద్దీ ప్రేమ, అన్నాడీఎంకే మద్దతుతో తమిళనాట పాగా వేసే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం