‘ రాహుల్ జీ ! మీ కాంగ్రెస్ ప్రభుత్వాల తీరు చూడండి !’…..కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి స్ట్రాంగ్ కౌంటర్
దేశంలో కరోనా వైరస్ కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ముందే జాగ్రత్త పడిఉంటే సెకండ్ కోవిద్ వేవ్ వచ్చి ఉండేది కాదని, పైగా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన నేపథ్యంలో మన పిల్లలను మనం రక్షించుకునేవారమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన...
దేశంలో కరోనా వైరస్ కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ముందే జాగ్రత్త పడిఉంటే సెకండ్ కోవిద్ వేవ్ వచ్చి ఉండేది కాదని, పైగా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన నేపథ్యంలో మన పిల్లలను మనం రక్షించుకునేవారమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి గట్టి కౌంటర్ ఇచ్చారు. మన బాలలకు ఇక వ్యాక్సిన్ ఎక్కడ ఉందని రాహుల్ ప్రశ్నిస్తున్నారని, అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, పంజాబ్ లలోని గార్బేజీల్లో వ్యాక్సిన్ ఉందని ఆయన ఎద్దేవా చేశారు.ఈ రాష్ట్రాల్లోని మీ పార్టీ నేతలు వ్యాక్సిన్లు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అని దుయ్యబట్టారు. పంజాబ్ లోని సీఎం అమరేందర్ సింగ్ ప్రభుత్వం ఈ వారం పెద్ద ఇరకాటంలో పడింది. తమకు అందిన 40 వేల డోసుల కోవాగ్జిన్ ని తిరిగి హెచ్చు ధరకు ప్రభుత్వం అమ్ముకుందని విపక్ష అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. డోసుకు 400 రూపాయల చొప్పున కొనుగోలు చేసి దాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు డోసు 1060 రూపాయలకు విక్రయించిందని..హాస్పటల్స్ కూడా తామూ తక్కువ తినలేదన్నట్టుగా డోసు 1560 రూపాయలకు అమ్ముకున్నాయని ఆయన అన్నారు. దీనిపై రాష్ట్రంలో పెద్దఎత్తున దుమారం రేగగా.. ప్రభుత్వం… ప్రైవేటు ఆస్పత్రులకు తమ వ్యాక్సిన్ అమ్మకాల విషయంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
ఇక రాజస్థాన్ రాష్ట్రంలో 11.5 లక్షల డోసుల వ్యాక్సిన్ వృధా అయిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. అయితే వృధా అయింది 2 శాతం కన్నా తక్కువేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇలా మీ పార్టీ ఆధ్వర్యంలోని రాష్టాల తీరు చూడండి అని మంత్రి హర్ దీప్ సింగ్ పురి మీడియా సమావేశంలో..రాహుల్ ను ఉద్దేశించి అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.