Coronavirus Pandemic: కరోనా వైరస్ కల్లోలం … దేశీయ విమానాల్లో ఇక నుంచి ఆ సేవలు బంద్
Coronavirus Pandemic:దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజు రోజుకీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..
Coronavirus Pandemic:దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతుంది. రోజు రోజుకీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉధృతి కట్టడికోసం పలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి నివారణ కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా గతఏడాది కేంద్రం.. దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలపై పలు ఆంక్షలు విధించింది. తరువాత దశలవారీగా విమాన సేవలను పునరుద్ధిరించింది. అయితే ఆ సమయంలో దేశీయ విమానాల్లో భోజన సేవలకు అనుమతులు ఇవ్వలేదు.. ఇక గత ఏడాది ఆగష్టు 31 తరువాత కొన్ని షరత్తులతో కూడిన అనుమతులను ఇచ్చింది. భోజన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
తాజాగా మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ సమీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా పలు చర్యలు చేపట్టింది. రెండు గంటల కంటే తక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో ఇక నుంచి భోజన సేవలపై నిషేధం విధించింది. దేశీయంగా రెండు గంటలకంటే ఎక్కువ సమయం ప్రయాణించే విమానాల్లో మాత్రమే ఇక నుంచి భోజన సదుపాయాలు ఉంటాయని తెలిపింది.
Also Read: త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..
కరోనా నియంత్ర కోసం అంటూ సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంపు .. ఎంతమేర అంటే..