Omicron: కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చర్యలు తీసుకోండి: 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Corona cases in India: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా ప్రమాదకర వేరియంట్ ఓమిక్రాన్ కేసులు వేగంగా

Omicron: కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చర్యలు తీసుకోండి: 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ
India Corona Cases
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 30, 2021 | 6:01 PM

Corona cases in India: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే కరోనా ప్రమాదకర వేరియంట్ ఓమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్‌లకు లేఖలు రాసింది. కోవిడ్-19 కేసులను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు కరోరనా పరీక్షలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడం, ట్రేసింగ్‌, కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టిసారించాలని లేఖలో తెలిపింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,154 కొత్త కరోనా కేసులు నమోదైన తరుణంలో కేంద్రం ఈ హెచ్చరిక చేసింది. కాగా.. గురువారం దేశంలో మొత్తం ఓమిక్రాన్ సంఖ్య 961కి పెరిగింది. దేశంలో వారం వారీగా పాజిటివిటీ రేటు 0.76 శాతం నమోదైంది. ఇది గత 46 రోజులలో 1 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది కాస్త.. 1.10 శాతానికి చేరిందని కేంద్రం తెలిపింది. గత 87 రోజులలో 2 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడారు. 33 రోజుల తర్వాత కేసుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించారు. గత నాలుగు రోజుల నుంచి కేసులు విపరీతంగా పెరుగున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే.. దేశంలోని 8 జిల్లాల్లో పాజిటివిటీ రేటు పదిశాతం పైన ఉందని.. 14 జిల్లాల్లో కేసుల సంఖ్య 5 నుంచి 10శాతానికి పెరిగిందన్నారు. ప్రజలంతా మార్గదర్శకాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

ఇదిలాఉంటే.. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 263 ఓమిక్రాన్ కేసులు ఉండగా.. మహారాష్ట్రలో 252, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు నమోదయ్యాయి.

Also Read:

Corona Virus: ఆ దేశంలో జీరో కోవిడ్ పాలసీ.. నిబంధనలు ఉల్లంగిస్తే అవమాన పడేలా వీధుల్లో ఉరేగింపు సహా అనేక శిక్షలు..

Covid Vaccine: నాలుగు డోసులు తీసుకున్నా.. కరోనా మహమ్మారి సోకింది..! అక్కడినుంచి వచ్చిన మహిళకు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!