Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: భారత్‌లోకి ఒమిక్రాన్‌.. బెంగళూరులో రెండు కేసులు నమోదు.. ధ్రువీకరించిన కేంద్రం..

దేశంలోకి ఎంటరైన ఓమిక్రాన్ వైరస్. బెంగళూరులో రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Omicron Variant: భారత్‌లోకి ఒమిక్రాన్‌.. బెంగళూరులో రెండు కేసులు నమోదు.. ధ్రువీకరించిన కేంద్రం..
Covid Omicron Variant
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 02, 2021 | 6:09 PM

ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెనింగ్ పరీక్షలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్‌ బారినపడ్డవారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు. దీంతో ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని.. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని.. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను ఉటంకిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వైరస్ 29 దేశాలకు విస్తరించిందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆందోళన వైవిధ్యాల విభాగంలో ఉంచింది. గత నెల రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పుడు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం కేసులలో 55 శాతం అని చెప్పుకొచ్చారు. జనాభాలో 49 శాతం మంది రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.