Delhi Schools: ఢిల్లీలో స్కూళ్లకు మళ్ళీ సెలవులు.. ఎప్పటి నుంచి.. ఎందుకోసం అంటే..

Delhi Schools: ఢిల్లీలో స్కూళ్లకు మళ్ళీ సెలవులు.. ఎప్పటి నుంచి.. ఎందుకోసం అంటే..
Holidays To Schools In Delhi

ఢిల్లీలో పాఠశాలలకు మళ్ళీ సెలవులు ప్రకటించారు. ఈ మధ్యనే తెరుచుకున్న స్కూల్స్ తిరిగి మూతపడనున్నాయి

KVD Varma

|

Dec 02, 2021 | 3:12 PM

Delhi Schools: కాలుష్యంపై సుప్రీంకోర్టు మందలింపు నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం-డిసెంబర్ 3) నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రాజధానిలోని అన్ని పాఠశాలలు మూసివేస్తారు. కాలుష్యం కారణంగా దిగజారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతకుముందు గురువారం నాడు కేంద్రం, ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల ప్రభుత్వానికి కోర్టు 24 గంటల సమయం ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు 24 గంటల్లో కఠిన చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుందని కోర్టు కేంద్రానికి తెలిపింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కాలుష్యం ఎందుకు తగ్గడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించిన కోర్టు

సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలిస్తూనే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు, పిల్లలను ఎందుకు బలవంతంగా పాఠశాలకు పంపుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పాఠశాలలు మూతపడ్డాయని ప్రభుత్వం అఫిడవిట్‌లో చెప్పిందని, అయితే అలా జరగలేదని కోర్టు పేర్కొంది. మీరు పిల్లల గురించి పట్టించుకోరా? అని ప్రశ్నించింది.

కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అదేసమయంలో దీనికి సంబంధించిన ఒక photo కూడా కోర్టుకు అందచేసింది. ఆ ఫోటో చూసిన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అందచేసిన అఫిడవిట్‌లో ఎంత మంది యువకులు కాలుష్యంపై అవగాహన బ్యానర్‌తో రోడ్డుపై నిలబడి ఉన్నారో చెప్పాలని  కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారా? వారి ఆరోగ్యం గురించి ఎవరైనా పట్టించుకుంటారా లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం స్పందిస్తూ.. బ్యానర్‌తో నిలబడిన యువత స్వచ్ఛంద సేవకులేనని కోర్టుకు తెలిపింది.

ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత నేటికీ మెరుగుపడలేదు. గురువారం కూడా ఢిల్లీ హవా ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉంది. లోధి రోడ్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 339 వద్ద నమోదైంది. గాలిలో పొగమంచు ఉంది. తీవ్రమైన ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇవికూడా చదవండి: Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..

Viral news: మూగజీవిపై అమానుషం.. కుమారుడిని కరిచిందని శునకాన్ని కర్కశంగా హతమార్చిన వైనం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu