Omicron Effect: ఒమిక్రాన్ టెన్షన్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమా.. వర్క్ ఫ్రం ఆఫీసా.. పునరాలోచనలో పడిన కంపెనీలు..!
Omicron Effect: కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కాలంలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం ఇచ్చేశాయి ఆయా కంపెనీలు. తర్వాత కరోనా తగ్గుముఖం..

Omicron Effect: కరోనా మహమ్మారి విజృంభించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కరోనా కాలంలో ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం ఇచ్చేశాయి ఆయా కంపెనీలు. తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత క్రమ క్రమంగా ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాయి. కానీ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్, ఇతర పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగులు ఇప్పటికి ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దాదాపు 50 శాతంకుపైగా కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించి పనులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే పనులు చేసేలా చర్యలు చేపడుతున్నాయి. కానీ ఇంతలోనే కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. పూర్తి స్థాయిలో ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించి పనులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్న కంపెనీలకు మరో తలనొప్పిగా మారిపోయింది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆయా కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి.
ఇంకా ఉద్యోగులు అలాగే వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించేలా ప్రకటన చేసేలా చర్యలు చేపడుతున్నాయి. ఒమిక్రాన్ భయంతో ఆయా కంపెనీలు యూ-టర్న్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. అలాగే ఇప్పటికే కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం వర్క్‌ఫ్రం ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం పునరాలోచనలో పడిపోయాయి. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎఫెన్ట్ పెద్దగా లేదని నివేదికలు చెబుతున్నా.. ముందస్తుగానే అప్రమత్తమవుతున్నాయి కంపెనీలు. యూఎస్‌తో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ భారీగానే ఉంది. క్రమ క్రమంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌తో కార్యాలయాలకు పెద్ద సవాలుగా మారింది. ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వాహన తయారీ కంపెనీ ఫోర్ట్ మోటారు కంపెనీ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడంపై పునరాలోచనలో పడింది.
ఆలస్యంగా ఉద్యోగులను కంపెనీకి రప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్, రైడ్‌షేరింగ్ సంస్థలు వచ్చే ఏడాది ప్రారంభంలో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్న నేపథ్యంలో మరోసారి పునరాలోచనలో పడింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై వెనుకడుగు వేస్తున్నాయి. ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఉద్యోగులకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జెఫ్ లెవిన్ షెర్జ్ ఈ ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పందించాయి. వర్క్ ఫ్రం హోమ్‌లో ఉన్న ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని ఆదేశాలు జారీ చేయగా, ఒమిక్రాన్ భయంతో పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా మరి కొన్ని రోజులు వర్క్ ఫ్రం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి: