KMC Election Result 2021: కోల్‌కతా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న టీఎంసీ..
KMC Election Result 2021 Counting: పశ్చిమబెంగాల్‌లోని కీలకమైన కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైంది. బీజేపీ-టీఎంసీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. తృణముల్ కాంగ్రెస్
KMC Election Result 2021 Counting: పశ్చిమబెంగాల్‌లోని కీలకమైన కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైంది. బీజేపీ-టీఎంసీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. తృణముల్ కాంగ్రెస్ ఖాతా తెరిచింది. కేఎంసీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లోని 144 వార్డుల్లో అధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 7 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. ఇంకా 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 4 స్థానాల్లో ముందంజలో ఉంది.
కేఎంసీలో అధిక స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుంటుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు చెరొక రెండు వార్డుల్లో, స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. టీఎంసీ అత్యధిక వార్డుల్లో దూసుకుపోతుండటంతో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఎంసీ పాలన రానుంది.
Also Read: