Gas Cylinder: మరో షాకింగ్ న్యూస్.. వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ భారీగా పెంపు
వంటగ్యాస్ సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు మంగళవారం అనౌన్స్ చేశాయి. ఇది కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి చేదువార్త అనే చెప్పాలి.
Cooking gas prices: కొత్తగా వంటగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. సిలిండర్ డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచుతూ చమురు సంస్థలు మంగళవారం నిర్ణయం తీసుకన్నాయి. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ డిపాజిట్ ధర ప్రజంట్ 1,450 ఉండగా దానిని రూ.2,200కు పెంచారు. అలాగే 5 కిలోల సిలిండర్ డిపాజిట్ ధర ఇప్పటివరకూ రూ.800 ఉండగా.. తాజాగా రూ.1,150లకు పెంచారు. అలాగే రెగ్యులేటర్ కాస్ట్ కూడా పెరిగిందండోయ్. ఇక నుంచి రూ.250 తీసుకుంటారు. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికే ఇవి వర్తిస్తాయి. ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని ఇంధన సంస్థలు వెల్లడించాయి.
కాగా గత నెలలో గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర పెరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ బండ ధరను రూ.3.50 పెంచారు. అలాగే కమర్షియల్ సిలిండర్ ధరను రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రజంట్ సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1003కు చేరింది. నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామాన్యులకు.. గ్యాస్ బండ కూడా గుదిబండగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి