Odisha Train Accident: రైలు దుర్ఘటనలో దారణం.. విద్యుత్ షాక్‌తో 40 మంది మృతి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటివరకు మరణించినవారిలో 101 మంది ప్రయాణికుల ఆచూకీ వివరాలు తెలియలేదు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 288 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటివరకు మరణించినవారిలో 101 మంది ప్రయాణికుల ఆచూకీ వివరాలు తెలియలేదు. అయితే వారి మృతదేహాలను కటక్ లోని ప్రభుత్వ మార్చురీలో భద్రపరిచారు. మరో విషయం ఏంటంటే ఈ మృతుల్లో కనీసం 40 మంది విద్యుత్ షాక్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలస్తోంది.
రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలిలో సహాయక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఇందులో కనీసం 40 మృతదేహాల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. ఈ విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. మూడు రైళ్లు ఢీ కొన్న సమయంలో ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడి విద్యుత్ షాక్ జరిగి ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.