Heart Attack: గుండెపోట్లు ఆ రోజే ఎక్కువగా వస్తున్నాయట.. తాజా అధ్యయనంలో సంచలనం విషయాలు
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోయే ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. యువకుల నుంచి ముసలివాళ్ల వరకు చాలామంది గుండెపోటు బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు గుండెపోటు వస్తుందోనని చాలామంది భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో చనిపోయే ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. యువకుల నుంచి ముసలివాళ్ల వరకు చాలామంది గుండెపోటు బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు గుండెపోటు వస్తుందోనని చాలామంది భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ ట్రస్ట్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని బయటపెట్టారు. తీవ్రస్థాయిలో గుండెపోట్లు.. సాధారణంగా సోమవారం రోజున ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయని తేల్చారు.
దాదాపు 10,528 మంది రోగుల డేటాను విశ్లేషించి ఈ సమాచారాన్ని వెల్లడించారు. ఈ రోగులంతా 2013 నుంచి 2018 మధ్య తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రుల్లో చేరారు. ఈ రుగ్మతను ఎస్‌టీ- సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్కషన్ (స్టెమీ)గా పిలుస్తారు. ప్రధాన రక్తనాళం పూర్తిగా పూడుకుపోవడం వల్ల ఇది తలెత్తుతుంది. అయితే వారం ప్రారంభ సమయంలో దీని ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి నిర్దిష్ట కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో ఆ ప్రమాదకర పరిస్థితి గురించి వైద్యులకు అవగాహన కలుగుతుందని, మరింత ఎక్కువ మంది ప్రాణాలను వారు కాపాడగలుగుతారని చెప్పారు. అయితే ఈ తీవ్ర గుండెపోట్లు సోమవారం నాడు ఎక్కవగా రావడానికి కారణాలు శరీర జీవగడియారంతో ముడిపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం