Truck Driver Fine: ఇదేమి చిత్రం.. హెల్మెట్‌ లేదని ట్రక్కు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా

Truck Driver Fine: నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న పేరుతో పోలీసులు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. ఒక వేళ ప్రశ్నిస్తే మీ రక్షణ కోసమే అంటూ సమాధానాలిస్తున్నారు...

Truck Driver Fine: ఇదేమి చిత్రం.. హెల్మెట్‌ లేదని ట్రక్కు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా
Follow us

|

Updated on: Mar 18, 2021 | 9:19 AM

Truck Driver Fine: నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న పేరుతో పోలీసులు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. ఒక వేళ ప్రశ్నిస్తే మీ రక్షణ కోసమే అంటూ సమాధానాలిస్తున్నారు. అయితే ఒక్కోసారి కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుండటంతో వాహనదారులు తీవ్ర స్థాయిలో చిర్రెత్తిపోతున్నారు.

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని చర్యలకు దిగుతున్నాయి. ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక ట్రక్కు డ్రైవర్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ట్రక్కు డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించని కారణంగా అతనికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు అధికారులు. ఈ ఘటనన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. సదరు ట్రక్కు డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించలేదంటూ ట్రాఫిక్‌ పోలీసులు ఈ జరిమానాను విధించారు. ఇలా ట్రక్కు డ్రైవర్‌కు హెల్మెత్‌ లేదని వెయ్యి రూపాయల జరిమానా విధించడం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అంతేకాదు ట్రాఫిక్‌ పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపతున్నారు.

వివరాల్లోకి వెళితే ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన టక్కు డ్రైవర్‌ ప్రమోగద్‌ కుమార్‌ తన వాహనం పర్మిట్‌ రెన్యువల్‌ చేయించుకునేందుకు రవాణాశాఖ కార్యాలయానికి వచ్చాడు. అయితే అక్కడి అధికారులు అతనికి వెయ్యి రూపాయల జరిమానా పడింది. దీంతో జరిమానా విధించడంతో ప్రమోద్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై అధికారులను అడుగగా, హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించామని చెప్పుకొచ్చారు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ సందర్భంగా ప్రమోద్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను ట్రక్‌ పర్మిట్‌ గడువు పూర్తయినందున రెన్యువల్‌ కోసం వచ్చానని, హెల్మెట్‌ ధరించనందుకు జరిమానా విధించారని వాపోయాడు.

కాగా, ఇలాంటి విచిత్రమైన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. అయితే ద్విచక్ర వాహనదారులకు కాకుండా ఇలా నాలుగు చక్రాల వాహనాలు నడిపే డ్రైవర్‌లకు కూడా హెల్మెట్‌ లేదని జరిమానా విధించడం గమనార్హం. చాలా మంది హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి మరిన్ని చర్యలు చేపడుతున్నారు. పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని హెల్మెట్‌ లేని వాహనదారులకు భారీగా జరిమానా విధిస్తున్నారు. అంతేకాకుండా లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇచ్చినా, మద్యం తాగి వాహనం నడిపినా, ఓవర్‌ స్పీడ్‌ ఇలా తదితర కారణాలతో కేసులతో పాటు జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇక హైదరాబాద్‌లో అయితే ప్రతి రోజు ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని వాహనదారులకు ఎన్నిసార్లు చెప్పినా.. తీరు మారడం లేదు. ప్రతి రోజు నిబంధనలు అతిక్రమించే వారి సంఖ్య పెరిగిపోతోంది.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండగకు ముందే కీలక ప్రకటన..!

వాహన యజమానులకు బ్యాడ్ న్యూస్.. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచనున్న కేంద్రం.. ఒక్కో వాహనానికి ఎంత పెంచిందంటే..