Train Accidents: గత 40 ఏళ్లలో దేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలివే.. అతి పెద్ద ప్రమాదం ఏదంటే?
Coromandel Express Train Accident: ఒడిశాలో శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో 278 మంది చనిపోగా.. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Coromandel Express Train Accident: ఒడిశాలో శుక్రవారం రాత్రి 7.15 గంటలకు బహనాగ స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదంలో 278 మంది చనిపోగా.. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ షాలీమార్ నుంచి చెన్నై వెళ్తోంది. మధ్యాహ్నం 3.20 సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. బహగాన స్టేషన్‌కు 7.15కి చేరుకుంది. ఆ సమయంలో పట్టాలు తప్పి లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. దాంతో ఇంజిన్‌తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్‌పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు జనరల్ బోగీలు ధ్వంసం అయ్యాయి. కోరమాండల్ ఎక్‌ప్రెస్‌కి మొత్తం 24 బోగీలు ఉంటే.. సగం బోగీలు ధ్వంసమయ్యాయి. అయితే, గత మూడు, నాలుగు దశబ్దాలుగా దేశంలో జరిగిన రైలు ప్రమాదాలను ఓసారి చూద్దాం..
- 1981 జూన్‌లో తుఫాను సమయంలో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోవడంతో సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 1988 జులైలో కేరళలోని పెరుముడి బ్రిడ్జిపై నుంచి ఆస్తముడి లేక్‌లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పడిపోవడంతో 106 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 1995 ఆగస్టులో ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొనడంతో 350 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆగస్టు 1999 కోలకత్తా సమీపంలో జరిగిన ప్రమాదంలో 285 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అక్టోబర్ 2005లో వెలిగొండలో జరిగిన ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జులై 2011లో ఫతేపూర్‌లో జరిగిన ప్రమాదంలో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
- 2012 మేలో హంపి ఎక్స్‌ప్రెస్ (హుబ్బళ్లి-బెంగళూరు) ఏపీ సరిహద్దుల్లో గూడ్స్ రైలును ఢీ కొట్టిన ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 43 మంది గాయాలపాలయ్యారు.
- 2014 మేలో ఉత్తర్‌ప్రదేశ్‌లో గోరఖ్‌పుర్ వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన దుర్ఘటనలో 25 మంది చనిపోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు.
- 2016 నవంబర్లో ఉత్తర ప్రదేశ్‌లో ఓ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 146 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 200 మందికి గాయాలయ్యాయి.
- 2016 నవంబరులో ఇందౌర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పుర్‌లో సమీపంలో పట్టాలు తప్పడంతో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయాలపయ్యారు.
- 2017 జనవరిలో ఏపీలోని విజయనగరం జిల్లా కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 2017 ఆగస్టులో ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్ సమీపంలో 9 బోగీలు పట్టాలు తప్పడంతో 70 మందికి గాయపడ్డారు.
- 2018 అక్టోబర్లో అమృత్ సర్ నగరం సమీపంలో ఓ ఫెస్టివల్ సందర్భంగా పెద్ద ఎత్తున జనం పట్టాలపైకి రావడం.. అదే సమయంలో ఓ రైలు దూసుకెళ్లడంతో ఏకంగా 59 మంది ప్రాణాలు కోల్పోగా మరో 57 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
- 2017 ఆగస్టులో ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ (పూరీ-హరిద్వార్) ముజఫర్‌నగర్ సమీపంలో పట్టాలు తప్పిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయాలపాలయ్యారు.
- 2022 జనవరిలో పశ్చిమ బెంగాల్ సమీపంలో బీకానేర్-గువాహటి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో.. 9 మంది ప్రాణాలు కోల్పోగా, 36 మంది గాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..