Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు 20ఏళ్లలో మూడుసార్లు ప్రమాదం.. ప్రతీసారి శుక్రవారమే..
కన్నుమూసి తెరిచేలోగా ఘోరం జరిగిపోయింది. రైలు ప్రమాదం వందలాది మంది జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. వేలాది మంది జీవితాలు క్షణాల్లో తల్లకిందులయ్యాయి. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు హిస్టరీ ఇప్పుడు హడలెత్తిస్తోంది. దీని హిస్టరీ చాలా భయానకంగా ఉంది. అవును, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఫ్రైడే ఫీయర్ ఉన్నట్లుంది.
కన్నుమూసి తెరిచేలోగా ఘోరం జరిగిపోయింది. రైలు ప్రమాదం వందలాది మంది జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. వేలాది మంది జీవితాలు క్షణాల్లో తల్లకిందులయ్యాయి. అయితే, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు హిస్టరీ ఇప్పుడు హడలెత్తిస్తోంది. దీని హిస్టరీ చాలా భయానకంగా ఉంది. అవును, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఫ్రైడే ఫీయర్ ఉన్నట్లుంది. కోరమాండల్ ట్రాజడి వెనుక పెద్ద కథే ఉంది. 20 ఏళ్లలో మూడు సార్లు కోరమాండల్‌కు ప్రమాదం జరిగింది. రెండు ఒడిషాలో, ఒకటి ఏపీలో జరుగగా.. ప్రమాదం జరిగిన మూడుసార్లూ శుక్రవారమే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
గడిచిన 20 ఏళ్లలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు మూడు సార్లు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రతీసారి శుక్రవారమే కావడం విశేషం. తొలిసారి 2009 ఫిబ్రవరి 13న ఒడిశాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు మృతి చెందగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. 2022 మార్చి 15న ఏపీలోని నెల్లూరు వద్ద ప్రమాదం జరిగింది. 8 బోగీలు పట్టాలు తప్పగా.. 100 మందికి గాయాలయ్యాయి. ఇక 2023, జూన్ 2న ఒడిశాలో జరిగిన ప్రమాదంలో 288 మంది మృతి చెందగా.. వెయ్యి మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలన్నీ శుక్రవారమే జరుగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..