India to Bharat: మళ్లీ ముదిరిన వివాదం.. ఈసారి ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’

సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలసిందే. అయితే జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మను పేర్కొవడం రాజకీయంగా సంచనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా పేరు కేంద్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తోందటూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదం మొదలైంది.

India to Bharat: మళ్లీ ముదిరిన వివాదం.. ఈసారి 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్'
Invitaion
Follow us
Aravind B

|

Updated on: Sep 06, 2023 | 12:45 PM

సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలసిందే. అయితే జీ-20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మను పేర్కొవడం రాజకీయంగా సంచనం రేపిన సంగతి తెలిసిందే. ఇండియా పేరు కేంద్ర ప్రభుత్వం మార్చాలని ప్రయత్నిస్తోందటూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదం మొదలైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏసియన్‌-ఇండియా సమ్మిట్‌, ఈస్ట్‌ ఏసియా సమ్మిట్‌ లకు ప్రధాని మోదీ బుధవారం, గురువారం నాడు వరసగా హాజరుకావాల్సి ఉంది. అయితే ఇందుకోసం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో భారత ప్రధానిని.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా పేరు మార్పు చేశారు. దీంతో ఇప్పటికే పేరు మార్పుతో ఉన్న వివాదం మరింత ముదిరినట్లైంది.

20వ ఏసియన్-ఇండియా సమ్మిట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రెండు పదాలను కూడా ఒకే ప్రకటనలో విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉన్నారో అర్థమవుతుందని చెప్పింది. ఇండియా అనే పేరుతో విపక్షాలు ఏకమయ్యాయని అందుకే బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. జీ-20 డిన్నర్ మీటింగ్ కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అధికారులు ఆహ్వానాన్ని పంపగా.. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు. అయితే ఇందులో ఇండియా పేరును భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోరుగా ప్రచారం నడిచింది. ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 28 విపక్ష పార్టీలు ఏకమైన సంగతి తెలిసిందే. అయితే విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం వల్లే.. బీజేపీ దేశం పేరు మారుస్తోందని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ కూటమి పేరును త్వరలోనే భారత్‌గా పేరు మారుస్తామని పలువురు నాయకులు చెబుతున్నారు.