AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa: ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు చెక్.. గోవా సర్కార్ సంచలన నిర్ణయం..

గోవాకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు.. చలాన్లు వేసే అధికారాన్ని ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు పరిమితం చేసింది. ఆ దిగువ స్థాయి పోలీసు సిబ్బంది ఎవరైనా చలాన్ల పేరుతో వేధిస్తే ఫోటో తీసి పోలీసు శాఖకు పంపాలని సూచించింది.

Goa: ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు చెక్.. గోవా సర్కార్ సంచలన నిర్ణయం..
Goa Traffic Police
Ram Naramaneni
|

Updated on: Apr 06, 2025 | 5:10 PM

Share

గోవాకు టూరిస్టులు తగ్గిపోతున్నారు.. ఇందుకు చాలా కారణాలున్నాయ్.. మితిమీరిన ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, హోటల్ రూమ్స్ ధరలు అధికంగా వసూలు చేయడం.. ఫుడ్‌కు ఎక్కువ రేట్లు చార్జ్ చేయడం వంటివి. మరో ప్రధాన సమస్య ఏంటంటే.. గోవా ట్రాఫిక్ పోలీసులు. అవును.. అన్ని ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కాపు కాస్తున్న గోవా ట్రాఫిక్ పోలీసులు.. గోవా రిజిస్ట్రేషన్ కాని వాహనం కనిపిస్తే మాత్రం వెంటనే ఆపుతారు. అన్నీ ఉన్నా కానీ ఎంతో కొంత ముట్టుజెప్పేవరకు అదీ ఇదీ అని రూల్స్ చెబుతారు. ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే వేలల్లో సమర్పించుకోవాల్సిందే. ఇది అక్కడికి వెళ్లిన ప్రతి టూరిస్ట్ ఫేస్ చేస్తోన్న సమస్య. అందులో చలాన్ కావాలంటే ఒకరేటు.. అవసరం లేదు అంటే మరో రేటు.. అతడిని తప్పించుకుని కాస్త ముందుకు వెళ్తే.. మరో ట్రాఫిక్ పోలీస్ తగులుతాడు. అతనిది అదే వరస ఉంటుంది. ఈ వేధింపులను అరికట్టడానికి..  బాడీ కెమెరాలు ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్లకు మాత్రమే ట్రాఫిక్ సంబంధిత ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేసేలా గోవా సర్కార్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇన్‌స్పెక్టర్ స్థాయి వ్యక్తి.. అది కూడా అతని బాడీకి కెమెరా ఉంటేనే చలానా వేయడానికి అధికారం ఉంటుంది.  మిగిలిన ఎవరూ చలానా వేయడానికి వీల్లేదు.

“ఈరోజు నుండి, పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు యూనిఫాంకు బాడీ కెమెరా ధరించి, పగటిపూట ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేస్తారు. రాత్రి సమయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి లేదా సబ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేయడానికి అధికారం కలిగి ఉంటారు. చలాన్లు ఉల్లంఘించిన వారి చిరునామాలకు నేరుగా పంపబడతాయి,” అని గోవా సీఎం చెప్పారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ లేదా అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న పోలీసు అధికారి ఎటువంటి చలాన్లు జారీ చేయడానికి అర్హులు కాదని సీఎం స్పష్టం చేశారు.

“ఆ ర్యాంకులకు చెందిన ఎవరైనా పోలీసు సిబ్బంది ట్రాఫిక్ చలాన్ జారీ చేస్తున్నట్లు తేలితే, పౌరులు వారి ఫోటోను క్లిక్ చేసి పోలీసు శాఖకు పంపవచ్చు. సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తాం. పర్యాటకులపై వేధింపులు అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం.” అని ప్రమోద్ సావంత్ చెప్పారు. పోలీసులు… డాష్ క్యామ్‌లు, రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన డిజిటల్ కెమెరాలు,  AIతో కూడిన ఇతర గాడ్జెట్‌లతో సహా అనేక పద్ధతుల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తారని ఆయన వివరించారు.

ఇక పోలీసులు, డాష్ క్యామ్‌లు, రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన డిజిటల్ కెమెరాలు మరియు కృత్రిమ మేధస్సుతో కూడిన ఇతర గాడ్జెట్‌లతో సహా అనేక పద్ధతుల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తారని ఆయన అన్నారు. ఇక గోవాకు గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు, వంట సామగ్రిని తీసుకువచ్చే పర్యాటకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. గోవాను క్లీన్ అండ్ సేఫ్‌గా ఉంచేందుకే ఈ నిర్ణయమన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..