Kerala CM: ఓమిక్రాన్ నేపథ్యంలో కేరళ సీఎం కీలక ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఉచిత వైద్యం నిలిపివేస్తాంః కేరళ సీఎం

మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు.

Kerala CM: ఓమిక్రాన్ నేపథ్యంలో కేరళ సీఎం కీలక ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకోకుంటే.. ఉచిత వైద్యం నిలిపివేస్తాంః కేరళ సీఎం
Kerala Cm
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 01, 2021 | 7:36 AM

Kerala CM on Medical Bills: మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. కోవిడ్‌ నివారణ చర్యలకు సహకరించని వారికి ఉచిత వైద్యం అందించబోమని కేరళ సీఎం పినరయి విజయన్‌ మంగళవారం తెలిపారు. “వ్యాక్సిన్ తీసుకోకుండానే కోవిడ్-19 పాజిటివ్‌గా మారిన వారి చికిత్స ఖర్చు ప్రభుత్వం భరించదు” అని విజయన్ తేల్చి చెప్పారు. కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం నిలివేస్తామని సీఎం జయన్‌ స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితి లేదా ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు ఈ విషయాన్ని నిర్ధారించేలా ప్రభుత్వ వైద్యుల వద్ద ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి RT-PCR నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల నగదును అయా వ్యక్తులే భరించాలి’’ అని అన్నారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి, ప్రజలతో మమేకమయ్యే వారికి ఇది వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు అప్రమత్తం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారి ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.

డిసెంబర్ 1 నుండి 15 వరకు కేరళలో మరోసారి ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పాఠశాల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అలాగే వికలాంగ పిల్లలను పాఠశాలలకు రావడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్-19 సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి విజయన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కొత్త వేరియంట్ వల్ల కలిగే భయం కారణంగా మరిన్ని సడలింపులు ఇవ్వకూడదని నిర్ణయించారు.

Weather Updates: అండమాన్ తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఉత్తరాంధ్ర, ఒడిస్సా తీరాలకు పొంచి ఉన్న ముప్పు!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!