Fuel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం!
Petrol Diesel rate today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. ముడిచమురు ధర తగ్గుదల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.91 శాతం తగ్గి 70.57 డాలర్లకు చేరుకుంది. అయితే డబ్ల్యూటీఐ క్రూడ్ ధరలు మాత్రం పెరిగాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 1.44 శాతం పెరిగి 67.13 డాలర్లకు చేరుకుంది. ముడిచమురు ధర తగ్గుదల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆయిల్ కంపెనీలు బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు IOC, BPCL మరియు HPCL నేడు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం ఇది వరుసగా 27వ రోజు.
నాలుగు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు డిసెంబర్ 1న రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.97 కాగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది. కానీ ఢిల్లీ పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.95.29, డీజిల్ ధర రూ.86.80గా ఉంది. ఘజియాబాద్‌తో పాటు, ఢిల్లీ కంటే ఎన్‌సీఆర్‌లో ఉన్న గురుగ్రామ్‌లో కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ రూ.95.90, డీజిల్ రూ.87.11గా ఉంది. అయితే, ఇవాళ ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, లీటర్ డీజిల్ ధర రూ.91.43గా ఉంది. కోల్‌కతాలో ఈరోజు పెట్రోల్ లీటరుకు రూ.104.67, డీజిల్ లీటరుకు రూ.89.79 చొప్పున విక్రయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చమురుపై ఆదాయం ఇలా.. ఇదిలావుంటే, కేంద్ర ప్రభుత్వం 2020 21 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ సుంకం వసూలు ద్వారా రూ. 3.72 లక్షల కోట్లు వసూలు చేసింది. మామూలుగా చెప్పాలంటే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇదే సమయంలో ఏడాది క్రితం రోజుకు దాదాపు రూ.488 కోట్ల ఆదాయం మాత్రమే కేంద్ర ఖజానాకు చేరేంది. లీటరు పెట్రోల్‌పై రూ.1.40 ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, రూ. 11 అదనపు ఎక్సైజ్ సుంకం, రూ. 13 (రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్), వ్యవసాయం, అభివృద్ధి మౌలిక సదుపాయాల సెస్‌గా రూ. 2.5 వసూలు చేస్తారు. దీని పూర్తి మొత్తం రూ. 27.90 కాగా, డీజిల్‌పై రూ. 1.80 ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, రూ. 8 ప్రత్యేక ఎక్సైజ్ సుంకం, రూ. 8 (రోడ్డు , మౌలిక సదుపాయాల సెస్), రూ. 4 వ్యవసాయం ,అభివృద్ధి మౌలిక సదుపాయాల సెస్. అంటే మొత్తం రూ.21.80. వీటికి తోడు డీలర్ లాభం కలుపుకుని వందకు పైగా పెట్రోల్ ధర పలుకుతోంది. అసలు ధర కంటే పన్నులు, టాక్స్‌ల రూపంలోనే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వినియోగిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేట్లను ఇలా తెలుసుకోండి.. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSPతో పాటు సిటీ కోడ్‌ను నమోదు చేయడం ద్వారా వారి మొబైల్ నుండి 9224992249కి సందేశం పంపుతారు. మీరు ఇండియన్ ఆయిల్ (IOCL) అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ కోడ్‌ను ఎంచుకోవచ్చు. మెసేజ్ పంపిన తర్వాత, మీకు పెట్రోల్, డీజిల్ తాజా ధర పంపుతుంది. అదేవిధంగా, BPCL వినియోగదారులు తమ మొబైల్ నుండి RSP అని టైప్ చేయడం ద్వారా 9223112222కు SMS పంపవచ్చు. HPCL కస్టమర్‌లు 9222201122కి HPPrice అని టైప్ చేయడం ద్వారా SMS పంపవచ్చు.