థర్డ్ ఫ్రంట్ కాదు……ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చకే సమావేశం…..తుస్సుమనిపించిన శరద్ పవార్

కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్ని ప్రతిపక్షాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, థర్డ్ ఫ్రంట్ దిశగా ఈ మీటింగ్ అడుగులు వేయవచ్చునని వచ్చిన వార్తలు ఊహాగానాలుగా తేలిపోయాయి.

  • Publish Date - 11:04 am, Tue, 22 June 21 Edited By: Anil kumar poka
థర్డ్ ఫ్రంట్ కాదు......ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చకే సమావేశం.....తుస్సుమనిపించిన శరద్ పవార్
Not A Third Front Says Sharad Pawar

కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్ని ప్రతిపక్షాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, థర్డ్ ఫ్రంట్ దిశగా ఈ మీటింగ్ అడుగులు వేయవచ్చునని వచ్చిన వార్తలు ఊహాగానాలుగా తేలిపోయాయి. తాము తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకే దీన్ని నిర్వహిస్తున్నామని శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాజకీయ నేతలు, మేధావులు. సినీ ప్రముఖులు , మీడియా వ్యక్తులు కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు. కాగా-2018 లో తానుఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ సమావేశాన్ని సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నట్టు బీజేపీ మాజీ నేత, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు, ఈ సమావేశానికి సంబంధం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేడీ-యూ నేత పవన్ వర్మ దీనిపై వివరణనిస్తూ..ఈ సమావేశానికి బీజేపీని తప్ప అన్నివర్గాల వారిని ఆహ్వానించామన్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషీ, మాజీ రాయబారి కె.సి.సింగ్, గీత రచయిత జావేద్ అఖ్తర్, చిత్ర నిర్మాత ప్రీతిష్ నంది, మీడియా పెద్ద కరణ్ థాపర్ ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తదితరులు ఇందులో పాల్గొంటారని ఆయన చెప్పారు.

నిజానికి నిన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, శరద్ పవార్ మధ్య సుమారు 3 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఇంత తీవ్రంగా జరిగిందంటే 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసమేనని, అన్ని విపక్షాలు కలిసి కట్టుగా ఏకతాటిపై ఆ ఎన్నికల్లో [పోటీ చేయాలని చర్చించి ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ అసలు థర్డ్ ఫ్రంట్ కు సంబంధించి ఏ సమావేశానికి తాను హాజరయ్యే ప్రసక్తి లేదని, బీజేపీ ని ఎదుర్కోవడానికి ఇలాంటి ఫ్రంట్ సవాలు చేయగలదని నమ్మవద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీని థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ గట్టి సవాలు కాగలవని తాను భావించడంలేదన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నేడో, రేపో టీపీసీసీ కొత్త చీఫ్..!కొన్ని నెలలుగా జరుగుతున్న కసరత్తులకు బ్రేక్ :Telangana New PCC Chief ? Live Video

viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .

అమితాబ్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి..గుడిలోనే పూజారిని కొట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Viral Video.