Covaxin: ఇవాళ నిపుణుల కమిటీ ముందుకు కొవాగ్జిన్ డేటా.. మూడో దశ ట్రయల్స్ నివేదికను సమర్పించిన భారత్ బయోటెక్
కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వివరాలను భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సమర్పించింది.

Covaxin Phase 3 Data: కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వివరాలను భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సమర్పించింది. దేశంలో అత్యవసర వినియోగానికి అధికారికంగా ఆమోదం పొందిన దాదాపు ఐదు నెలల తర్వాత కొవాగ్జిన్ పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో ఇవాళ డీసీజీఐ ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సమావేశం కానున్నది. ఈ మధ్యాహ్నం జరిగే సమావేశంలో కొవాగ్జిన్ పూర్తి సమర్థతపై చర్చించనున్నారు.
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్.. కరోనా సంక్రమణను నివారించడంలో 81 శాతం ప్రభావవంతంగా ఉందని పేర్కొంది. చివరి దశ ట్రయల్స్ ఫలితాల ప్రారంభ విశ్లేషణ ప్రకారం. 3 వ దశ డేటా లేనప్పుటికీ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) కోవాగ్జిన్ వాడకాన్ని పరిమితం చేయడాన్ని ఆమోదించింది. అయితే ఈ నెల ప్రారంభంలో టీకా అంతర్జాతీయ అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో బుధవారం ‘ప్రీ-సబ్మిషన్’ సమావేశం సైతం జరుగనుంది. అత్యవసర వినియోగ జాబితా కోసం ట్రయల్ డేటాలో భద్రత, సమర్థత, నాణ్యత, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను పరిశీలిస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందితే భారత్ బయోటెక్ టీకాలను ఎగుమతి చేయడంతో పాటు కొవాగ్జిన్ టీకా తీసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాన్ని సైతం సులభతరం చేస్తుంది. మార్చిలో భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్ తొలి మధ్యంతర ఫలితాలను ప్రకటించింది. టీకా 81శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న మూడు టీకాల్లో కొవాగ్జిన్ ఒకటి. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారు చేసింది.
ఇదిలావుంటే, కరోనాను ఎదుర్కోవడంలో కొవాగ్జిన్ కంటే కోవిషీల్డ్‌లోనే అధిక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయంటూ ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీనిపై కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది. ప్రాథమిక పరిశోధనలో చాలా లోపాలు ఉన్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది. స్వదేశీ టీకా కొవాగ్జిన్ పనితీరుపై అధ్యయనాన్ని ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో రివ్యూ చేయలేదు. శాస్త్రీయంగా కూడా ఆమోదించలేదు. కోవాగ్జిన్ టీకా మొదటి, రెండో డోసుల తర్వాత స్పైక్ ప్రోటీన్ రోగనిరోధకతపై ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. అందులో కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ లోనే అధిక యాంటీబాడీలు ఉన్నాయని తేల్చేసింది. అయితే, ఈ అధ్యయనాన్ని భారత్ బయోటెక్ కొట్టిపారేసింది. అందులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంది. తాజాగా భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్ డేటాను డీసీజీఐకు సమర్పించింది.




