ఛీ.. ఛీ.. మరీ ఇంత కక్కుర్తా.. పక్కన శవం.. మార్చురీలో కామ క్రీడ.. నెట్టింట వైరల్..
అదో మార్చురీ.. అక్కడ శవాలే ఉంటాయ్.. అలా మార్చురీలో ఓ స్ట్రెచర్ పై శవం ఉంది. అక్కడో డ్యూటీ డాక్టర్, సూజర్‌వైజర్ కూడా ఉండాలి.. కానీ.. ఎవ్వరూ లేరు.. ఇలాంటి ప్రదేశంలో ఓ గురుడు గూడుపుఠాణి చేశాడు.. ఇదే ఏకాంత ప్రదేశం అనుకున్నాడు.. అక్కడికి ప్రియురాలిని పిలిచాడు..
అదో మార్చురీ.. అక్కడ శవాలే ఉంటాయ్.. అలా మార్చురీలో ఓ స్ట్రెచర్ పై శవం ఉంది. అక్కడో డ్యూటీ డాక్టర్, సూజర్‌వైజర్ కూడా ఉండాలి.. కానీ.. ఎవ్వరూ లేరు.. ఇలాంటి ప్రదేశంలో ఓ గురుడు గూడుపుఠాణి చేశాడు.. ఇదే ఏకాంత ప్రదేశం అనుకున్నాడు.. అక్కడికి ప్రియురాలిని పిలిచాడు.. ఇంకేముందు ఇద్దరూ కలిసి మంచిగా శృంగారంలో పాల్గొన్నారు.. పక్కనే శవం ఉందే.. అని కూడా లేకుండా ఇద్దరూ పనికానించుకొని వెళ్లిపోయారు.. కట్ చేస్తే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది.. నోయిడాలోని సెక్టార్ 94లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మార్చురీ ఫ్రీజర్ గది లోపల మృతదేహం దగ్గర ఈ జంట శృంగారంలో పాల్గొంది.. ఈ సంఘటన దాదాపు నెల రోజుల క్రితం జరిగినట్లు పేర్కొంటన్నప్పటికీ.. దానికి సంబంధించిన వీడియో ఆగస్ట్ 23న వైరల్ అయింది.
ఈ ఘటన వెలుగులోకి కాగానే.. నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ శర్మ సెక్టార్ -126 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.. వీడియోలోని వ్యక్తి మార్చురీలో పనిచేస్తున్న స్వీపర్ షేర్ సింగ్ అని దర్యాప్తులో తేలింది. ఘటనా స్థలంలో ఉన్న డ్రైవర్ భాను, క్లీనర్ పర్వేంద్ర అనే మరో ఇద్దరు ఉద్యోగులతో పాటుషేర్‌సింగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోను పర్వేంద్ర రికార్డ్ చేసి వైరల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మహిళను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు.
కాగా.. ఆరోగ్య శాఖ షేర్ సింగ్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.. ఈ విషయంపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.. నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ శర్మ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ఆసుపత్రిలో భద్రతా లోపాలను బయటపెట్టారు . డిప్యూటీ సీఎంఓలు డాక్టర్ జైసాలాల్, డాక్టర్ ఆర్పీ సింగ్, ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ రిషబ్ కుమార్ సింగ్‌లతో సహా ముగ్గురు సభ్యుల కమిటీ ఈ ఘటనపై విచారణ చేపట్టిందని తెలిపారు. అయితే.. మార్చురీలో ఓ డాక్టర్ ఇన్‌ఛార్జ్ గా ఉంటారు.. కానీ.. మార్చురీలో ఎవరూ లేకపోవడంపై పలు పశ్నలు తలెత్తుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..