తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట.. ఆ నిబంధనలను వెనక్కి తీసుకున్న ఢిల్లీ సర్కార్..

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరటను కలిగిస్తూ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చే ప్రయాణీకులపై..

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట.. ఆ నిబంధనలను వెనక్కి తీసుకున్న ఢిల్లీ సర్కార్..
Telugu States Passengers
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 14, 2021 | 7:47 AM

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరటను కలిగిస్తూ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఢిల్లీ వచ్చే ప్రయాణీకులపై ఉన్న ఆంక్షలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల.. ఆయా రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ నెగెటివ్ వచ్చిన సర్టిఫికేట్ తప్పనిసరిగా ప్రయాణ సమయంలో తమతో తీసుకురావాల్సి ఉంటుందని గత నెల 6వ తేదీన కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

అలా వచ్చినవారు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని.. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని ఆదేశించింది. ఇక తాజాగా ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఢిల్లీ సర్కార్ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఇవి తక్షణం అమలు చేయాలని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులను ఆదేశించింది.

ఢిల్లీలో మరిన్ని సడలింపులు..

ఢిల్లీలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుతుండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ప్రకటించింది. సోమవారం నుంచి అన్ని మార్కెట్లు, మాల్స్, దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరుచుకోవచ్చునని అన్నారు. అలాగే 50 శాతం కెపాసిటీతో మెట్రో, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు. ఇక స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లు, సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, పబ్లిక్ పార్కులు మూసే ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్.. జూలై 1 నుంచి ఆన్‌లైన్ క్లాసులు.. వివరాలు