PM Modi: జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు.. సైనికులపై ప్రశంసల జల్లు
PM Modi Diwali: దివ్వెల పండుగ దీపావళిని మరోసారి జవాన్లతో కలిసి జరుపుకున్నారు ప్రధాని మోదీ. హిమాచల్ లోని లెప్చాలో జవాన్లతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. సాహసమే జీవితంగా నడిచే సైనికులతో దీపావళి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మోదీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

దీపావళి సంబరాలను ప్రధాని మోదీ ఈసారి కూడా జవాన్లతో జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ లోని లెప్చా సెక్టార్‌లో జవాన్లతో దీపావళి సంబరాలు చేసుకున్నారు. ఎంతో కఠిన పరిస్థితుల్లో జవాన్లు తమ విధులను నిర్వహిస్తున్నారని మోదీ ప్రశంసించారు. దేశం కోసం పోరాడుతున్న జవాన్ల కోసం దీపావళి వేళ ప్రతి ఇంట్లో ఓ దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు మోదీ. గత 9 ఏళ్ల నుంచి జవాన్లతో దీపావళి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
భారత రక్షణరంగంలో పెనుమార్పులు వస్తున్నాయని అన్నారు మోదీ.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశంలోనే అధునాతన ఆయుధాల తయారీ జరుగుతోందన్నారు. సైనికులతో కలిసి జెండావందనంలో ఆయన పాల్గొన్నారు. సాహసానికి మారుపేరైన మన భద్రతా బలగాలతో కలిసి పండగ చేసుకుంటున్నట్లు తెలిపారు మోదీ. మిలిటరీ దుస్తులు ధరించిన మోదీ.. సైనికులతో ముచ్చటించారు.
“జవాన్లకు దేశం కృతజ్ఞతలు చెబుతోంది. వీరసైనికుల కోసం ప్రతి ఇంట్లో తప్పకుండా ఓ దివ్వెను వెలిగించాలి. ప్రతి పూజలో మీ సంక్షేమం కోసం భగవంతుడిని ప్రార్ధిస్తాం. అందుకే ప్రతిసారి నాకు దీపావళిని సైనికులతో కలిసి జరుపుకోవడం చాలా ఇష్టం” అని ప్రధాని పేర్కొన్నారు.
Reached Lepcha in Himachal Pradesh to celebrate Diwali with our brave security forces. pic.twitter.com/7vcFlq2izL
— Narendra Modi (@narendramodi) November 12, 2023
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రతి ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. జవాన్లతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గత ఏడాది కార్గిల్‌లో వేడుకలు చేసుకున్నారు. దేశప్రజలకు మోదీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతిఒక్కరి జీవితంలోకి ఆనందాన్ని, సమృద్ధిని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.