కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా.. సభలోనే బైఠాయించిన బీజేపీ ఎమ్మెల్యేలు
కర్ణాటక అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఆందోళనకు దిగారు. శ్రీమంత్ పాటిల్‌ను కిడ్నాప్ చేసి డ్రామాలాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు బలపరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే అంతకు ముందు శాసనసభలో మరో హైడ్రామా నడిచింది. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాశారు. గవర్నర్ రాసిన లేఖను స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చదివి వినిపించారు. అయితే స్పీకర్‌ను గవర్నర్ ఎలా ఆదేశిస్తారని […]
కర్ణాటక అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఆందోళనకు దిగారు. శ్రీమంత్ పాటిల్‌ను కిడ్నాప్ చేసి డ్రామాలాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు బలపరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే అంతకు ముందు శాసనసభలో మరో హైడ్రామా నడిచింది. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాశారు. గవర్నర్ రాసిన లేఖను స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చదివి వినిపించారు. అయితే స్పీకర్‌ను గవర్నర్ ఎలా ఆదేశిస్తారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. కాగా.. బలపరీక్షపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభలో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓ వైపు కాంగ్రెస్ సభ్యులు మరోవైపు బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగి.. సభలోనే బైఠాయించారు.