బ్రదర్‌తో ట్రబుల్.. మాయావతికి ఐటీ దెబ్బ..

బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్‌ను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఏడు ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ నోయిడాలో ఉంది. ఢిల్లీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్.. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య లతకు ఈ నెల 16న నోటీసులు జారీ చేయగా.. ఇవాళ అమలు చేశారు. ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:11 pm, Thu, 18 July 19
బ్రదర్‌తో ట్రబుల్.. మాయావతికి ఐటీ దెబ్బ..

బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్‌ను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఏడు ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ నోయిడాలో ఉంది. ఢిల్లీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్.. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య లతకు ఈ నెల 16న నోటీసులు జారీ చేయగా.. ఇవాళ అమలు చేశారు. ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య లతకు చెందిన న్యూఢిల్లీ, నోయిడా పరిధిలోని ఆస్తులను కూడా జప్తు చేశారు. కాగా, ఆనంద్‌ను బీఎస్పీ ఉపాధ్య‌క్షుడిగా మాయావతి నియమించారు.