మోదీజీ.. ఆ సాధ్వి ఆరోగ్యం క్షీణిస్తోంది.. ఓ సారి చూడండంటూ నితీష్ లేఖ..!

ప్రధాని నరేంద్ర మోదీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లేఖ రాశారు. గంగానిది ప్రక్షాళన కోసం.. గతేడాది డిసెంబర్ 15వ తేదీ నుంచి సాధ్వి పద్మావతి నిరాహార దీక్ష చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది. దీంతో సీఎం నితీష్.. వెంటనే ప్రధాని మోదీకి.. ఆ సాధ్వి ఆరోగ్య పరిస్థితి చూడాలంటూ.. లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం రోజుకింత క్షీణిస్తోందని.. వెంటనే ఆ సాధ్వి డిమాండ్లను నెరవేర్చే దిశగా మీరే చొరవచూపి.. దీక్ష […]

మోదీజీ.. ఆ సాధ్వి ఆరోగ్యం క్షీణిస్తోంది.. ఓ సారి చూడండంటూ నితీష్ లేఖ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 24, 2020 | 9:27 AM

ప్రధాని నరేంద్ర మోదీకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లేఖ రాశారు. గంగానిది ప్రక్షాళన కోసం.. గతేడాది డిసెంబర్ 15వ తేదీ నుంచి సాధ్వి పద్మావతి నిరాహార దీక్ష చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తోంది. దీంతో సీఎం నితీష్.. వెంటనే ప్రధాని మోదీకి.. ఆ సాధ్వి ఆరోగ్య పరిస్థితి చూడాలంటూ.. లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం రోజుకింత క్షీణిస్తోందని.. వెంటనే ఆ సాధ్వి డిమాండ్లను నెరవేర్చే దిశగా మీరే చొరవచూపి.. దీక్ష విరమింపచేయాలని లేఖలో పేర్కొన్నారు. కాగా గంగానదిని ప్రక్షాళన చేయాలని గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలంద ప్రాంతానికి చెందిన పద్మావతి అనే సాధ్వి.. హరిద్వార్‌లో గత ఏడాది డిసెంబర్‌లో నిరాహార దీక్షకు దిగారు. మరోవైపు గంగానది ప్రక్షాళనకు మోదీ సర్కార్ నడుం బిగించినా.. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు.