AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిగో ఉరికంబం ! నిర్భయ దోషుల్లో టెన్షన్.. టెన్షన్

నిర్భయ  దోషులను ఉరి తీయడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఈ నలుగురినీ ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. మీ చివరి కోర్కె ఏమిటన్న తీహార్ జైలు అధికారుల ప్రశ్నకు వీరినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిజానికి ఈ నెల 22 న ఈ దోషులను ఉరి తీయవలసి ఉన్న నేపథ్యంలో వీరికి అధికారులు సమన్లు జారీ చేశారు. కానీ వాటికి వీరు స్పందించలేదు. ఈ నలుగురినీ వీరి […]

అదిగో ఉరికంబం ! నిర్భయ దోషుల్లో టెన్షన్.. టెన్షన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 7:15 PM

Share

నిర్భయ  దోషులను ఉరి తీయడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఈ నలుగురినీ ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. మీ చివరి కోర్కె ఏమిటన్న తీహార్ జైలు అధికారుల ప్రశ్నకు వీరినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. నిజానికి ఈ నెల 22 న ఈ దోషులను ఉరి తీయవలసి ఉన్న నేపథ్యంలో వీరికి అధికారులు సమన్లు జారీ చేశారు. కానీ వాటికి వీరు స్పందించలేదు.

ఈ నలుగురినీ వీరి కుటుంబాలు వారంలో రెండు సార్లు కలుసుకునేందుకు అనుమతించారు. కాగా.. వీరు ఆహారం  తక్కువగా తింటున్నారని, టెన్షన్ గా ఉంటున్నారని తెలిసింది.   రోజూ వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి మెడికల్ రిపోర్టులు నార్మల్ గానే ఉన్నట్టు తెలిసింది. ఈ దోషుల సెల్స్ బయట ఇద్దరేసి చొప్పున గార్డులు అనుక్షణం కాపలా ఉంటున్నారట. అటు-తీహార్ జైలు అధికారులు ఇప్పటికే మూడు సార్లు డమ్మీ ఉరి ట్రయల్స్ నిర్వహించారు. ఈ నలుగురిలో  ఇద్దరు ఎలాంటి క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయలేదు.

ఆ జడ్జి సుప్రీంకోర్టుకు బదిలీ

ఇలా ఉండగా.. నిర్భయ దోషులు నలుగురికీ డెత్ వారెంట్లు జారీ చేసిన సెషన్స్ కోర్టు జడ్జి సతీష్ కుమార్ అరోరాను సుప్రీంకోర్టులో అదనపు రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో డిప్యుటేషన్‌పై ఉంటారు. నిర్భయ దోషులను త్వరగా ఉరి తీయాలంటూ ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను అరోరా విచారిస్తున్నారు. ఇక ఆయన బదిలీ అయ్యారు గనుక ఆయన స్థానే రానున్న కొత్త న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి.

Follow Us
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు