Zojila Tunnel: నేడు జోజిలా టన్నెల్‌ను సందర్శించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మేఘా ప్రతినిధులతో భేటీ..

Zojila tunnel - MEIL: మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను ఈ రోజు

Zojila Tunnel: నేడు జోజిలా టన్నెల్‌ను సందర్శించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మేఘా ప్రతినిధులతో భేటీ..
Zojila Tunnel
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2021 | 6:54 AM

Zojila tunnel – MEIL: మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను ఈ రోజు కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించనున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టులపై అధికారులతో, మేఘా ప్రతినిధులతో సమీక్షించనున్నారు. జోజిలా టన్నెల్ జాతీయ భద్రత, సైనిక అవసరాలను తీర్చడానికి, జమ్మూ కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల అభివృద్ధికి, పర్యాటకరంగ అభివృద్దికి దోహదపడనుంది. ఈ టన్నెల్ లడఖ్ ప్రాంతం- కార్గిల్, లేహ్‌కి ఏడాది పొడవునా రహదారి కనెక్టివిటీని అందించనుంది. ఈ టన్నెల్‌తో 30 ఏళ్ల లద్దాఖ్‌ ప్రజల కోరిక నెరవేరనుంది. ఈ జోజిలా టన్నెల్ పనులను నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) 2020 అక్టోబర్ 15న ప్రారంభించింది. వేలాది కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. టన్నెల్ ప్రాంతానికి చేరుకుని పనులను పరిశీలించనున్నారు. రెండు రోజుల పర్యటనలో ఉన్న గడ్కరీ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఈ రోజు నేరుగా జోజిలా టన్నెల్ కు చేరుకుని.. పనులను పర్యవేక్షించనున్నారు. జోజిలా టన్నెల్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 6.5 Km పొడవు సొరంగాన్ని తవ్వారు. మేఘా సంస్థ ఆధ్వర్యంలో (Megha Engineering & Infrastructures Limited) పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టన్నెల్ పురోగతి గురించి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. ఇదిలాఉంటే.. ఆదివారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా జోజిలా టన్నెల్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

జోజిలా టన్నెల్.. విశేషాలు.. జోజిలా టన్నెల్.. ఆసియాలోని అతి పొడవైన సొరంగ మార్గం. ఇది శ్రీనగర్‌, కార్గిల్‌, లేహ్‌ను కలిపే లైఫ్‌లైన్‌. అతిపొడవైన ఈ టన్నెల్ ప్రాజెక్టును తెలుగు వారి సంస్థ మేఘ ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) నిర్మిస్తోంది. ఈ నిర్మాణ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఫస్ట్‌ బ్లాస్ట్‌తో ప్రారంభించారు. దీని పనులు 2020 అక్టోబర్ లో ప్రారంభమయ్యాయి. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. శ్రీనగర్‌ నుంచి లేహ్‌ వరకు మధ్యలో కార్గిల్‌కు అనుసంధానం చేస్తూ నిర్మించే ఈ టన్నెల్‌ చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 30 ఏళ్లుగా ఈ టన్నెల్‌ కోసం కార్గిల్‌, లద్దాఖ్‌ ప్రజలు టన్నెల్ నిర్మించాలని కోరుతున్నారు. ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఆర్నెల్లపాటు సరుకులు రవాణా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉంటుంది. అందువల్ల అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా.. ఏడాది పొడవునా కనెక్టివిటినీ అందించేందుకు ఈ టన్నెల్ ను నిర్మిస్తున్నారు.

2013లో రూపకల్పన.. 2013లో యూపీఏ హయాంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ తర్వాత మోదీ సర్కార్‌ హయాంలో 4 సార్లు టెండర్లు పిలిచినా సఫలం కాలేదు. ‘ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన MEIL ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా నాలుగేళ్ళలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలని’ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకాంక్షించారు. జోజిలా టనెల్‌ నిర్మాణానికి వాస్తవంగా 10,643 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ రోడ్లు, టన్నెల్‌ను వేర్వేరుగా నిర్మించడం వల్ల 3,835 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని ప్రభుత్వం అంటోంది. శ్రీనగర్- లద్దాఖ్‌ మధ్య ప్రస్తుతమైతే ప్రయాణానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. జోజిలా టన్నెల్‌ పూర్తయితే కేవలం 15 నిమిషాల్లోనే ఈ దూరాన్ని చేరుకోవచ్చు. జోజిలా టన్నెల్‌ ను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, ఓవర్‌ హైట్‌ వాహనాలను గుర్తించడం, ఆటోమెటిక్‌ ఫైర్‌ డిటెక్షన్‌, ఫైర్‌ అలారం, ఇక స్పీడ్‌ లిమిట్‌ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు.

Also Read:

LPG Cylinder: కొత్త గ్యాస్ కనెక్షన్‌ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు..

Telangana Assembly: గులాబ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణలో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!