కోయంబత్తూరు కారు పేలుడు కేసులో కీలక మలుపు.. దర్యాప్తు ఇక ఎన్ఐఏ చేతుల్లోకి..
కారులో పేలుడు తరువాత కోయబత్తూరులో హైఅలెర్ట్ కొనసాగుతోంది. సిటీ లోని కీలక ప్రాంతాల్లో అనుమానాస్పదంగా వదిలేసిన పాత కార్లను గుర్తించారు పోలీసులు. ముఖ్య కూడళ్లలో 12 కార్లను గుర్తించి సీజ్ చేశారు.
కోయంబత్తూరు కారు పేలుడు కేసుపై కేంద్రం ఎన్‌ఐఏ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు పేలుడులో చనిపోయిన ముబిన్ దగ్గరి బంధువు అఫ్జర్‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుడు ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా డిమాండ్ చేశారు.
అరెస్టయిన వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ ముఠా కోయంబత్తూరుతో సహా ఇంకా ఎక్కడ పేలుళ్లకు కుట్ర పన్నిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.
కేంద్రం హెచ్చరించినప్పటికి తమిళనాడు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించలేదన్న బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై ఆరోపణల్లో నిజం లేదన్నారు డీజీపీ శైలేంద్రబాబు. కారు పేలుడు కేసులో చక్కగా దర్యాప్తు చేసిన పోలీసులను ఆయన అభినందించారు. కారు పేలుడుపై తమ దగ్గర ఉన్న సమాచారాన్ని ఎన్‌ఐఏ అధికారులకు ఇస్తామని తెలిపారు.
కారులో పేలుడు తరువాత కోయబత్తూరులో హైఅలెర్ట్ కొనసాగుతోంది. సిటీ లోని కీలక ప్రాంతాల్లో అనుమానాస్పదంగా వదిలేసిన పాత కార్లను గుర్తించారు పోలీసులు. ముఖ్య కూడళ్లలో 12 కార్లను గుర్తించి సీజ్ చేశారు. ఈ వాహనాల యాజమానులకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కార్లను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి