AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామేశ్వరం కెఫే పేలుడు కేసు NIA దర్యాప్తు.. వెలుగులోకి కీలక విషయాలు

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా NIA ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు NIA మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 1న జరిగిన రామేశ్వరం కెఫే పేలుడులో పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ ఘటన వెనుక మాస్టర్ మైండ్స్ అని భావిస్తున్న ముస్సవిర్‌ హుస్సేన్‌ షాజీబ్, అబ్దుల్‌ మతీన్‌ తాహాలను కోల్‌కతాలో గత ఏప్రిల్‌ 12న NIA అధికారులు అరెస్టు చేశారు.

రామేశ్వరం కెఫే పేలుడు కేసు NIA దర్యాప్తు.. వెలుగులోకి కీలక విషయాలు
Rameshwaram Cafe
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 22, 2024 | 4:48 PM

Share

బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా NIA ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ మేరకు NIA మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 1న జరిగిన రామేశ్వరం కెఫే పేలుడులో పలువురు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ ఘటన వెనుక మాస్టర్ మైండ్స్ అని భావిస్తున్న ముస్సవిర్‌ హుస్సేన్‌ షాజీబ్, అబ్దుల్‌ మతీన్‌ తాహాలను కోల్‌కతాలో గత ఏప్రిల్‌ 12న NIA అధికారులు అరెస్టు చేశారు. వారిని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వెల్లడైన వివరాల మేరకు పేలుడుకు సహకరించిన వారి కోసం దేశవ్యాప్తంగా NIA జల్లెడ పడుతోంది. ప్రధాన నిందితులకు మరో 11 మంది సహకరించినట్లు వారు పక్కా సమాచారం రాబట్టారు.

ఇక ఏపీలోని రాయదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సోహైల్‌ను NIA అదుపులోకి తీసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో 7 గంటల పాటు విచారించిన అనంతరం అతడిని బెంగళూరు తరలించారు. రాయదుర్గం వేణుగోపాలస్వామి వీధిలో నివాసముంటున్న రిటైర్డ్ టీచర్ అబ్దుల్‌కు సోహైల్, మథిన్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దవాడైన సోహైల్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. సంవత్సర కాలంగా ఇంటి వద్ద నుంచే షిఫ్టులకు అటెండ్ అవుతున్నాడు. గతంలో సోహైల్‌ బెంగళూరులోని ఓ పీజీ గదిలో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఉండేవాడు. రెండు నెలల కిందట రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో సోహైల్‌ స్నేహితుడిని ఒక నిందితుడిగా NIA గుర్తించింది. అతడితో కలిసి సోహైల్‌ హైదరాబాద్‌కు వెళ్లేవాడని తెలిసింది. బాంబు పేలుడు ఘటన నిందితుడితో చాలాసార్లు వాట్సాప్‌లో మాట్లాడటం, చాటింగ్‌ చేయటం వంటివి గుర్తించిన అధికారులు సోహైల్‌ కదలికలపై ఫోకస్ పెట్టారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా రాయదుర్గంలోని తన ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలోనూ వికారాబాద్‌ జిల్లా పూడురుకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 2012లో వెలుగుచూసిన బెంగళూరు కుట్ర కేసులో శిక్షపడ్డ హైదరాబాద్‌కు చెందిన ఒబేద్‌ ఉర్‌ రెహమాన్‌ ఇంట్లోనూ NIA సోదాలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…